ముస్లింల అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. తానేప్పుడు అధికారపార్టీల వైపుకాదు... ఎల్లప్పుడూ ప్రజల వైపే ఉంటానని స్పష్టం చేశారు. ముస్లింలు బీజేపీలో చేరి దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపు నిచ్చారు.
 ఆంధ్రప్రదేశ్లోని ముస్లిం సోదరులందరు బీజేపీలో చేరి దేశాభివృద్ధి లో పాలుపంచుకోవాలని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పిలుపునిచ్చారు. 
ఆంధ్రప్రదేశ్ లోని ముస్లిం సోదరులందరు బీజేపీలో చేరి దేశాభివృద్ధి లో పాలుపంచుకోవాలని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ పిలుపునిచ్చారు. ముస్లిం మైనారిటీల అభివృద్ధి కి  బీజేపీ కట్టుబడి ఉందని, తానెల్లప్పుడు మైనారిటీ ప్రజల కు మేలు చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఆదివారం కర్నూలు లో ని పరిణయ ఫoక్షన్ హాల్ లో జరిగిన బీజేపీ మైనారిటీ ల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎంపీ టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 



ముస్లిం పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర నాయకులు అబ్దుల్ సత్తార్, నంద్యాల పార్లమెంటు బీజేపీ మైనారిటీ నేతలు డిపి జమాల్ బాష, మహ్మద్ రఫీ ,కర్నూలు కు చెందిన దిల్ షాద్ బాష, నజీర్ అహమ్మద్ ల ఆధ్వర్యంలో వందలాది మంది ముస్లిం లు ఎంపీ టీజీ వెంకటేష్  సమక్షంలో ఘనంగా బీజేపీలో చేరారు. వారందరికీ ఎంపీ టీజీ సాదరంగా స్వాగతం పలికి సభ్యత్వం నమోదు చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఇంతమంది ముస్లింలు బీజేపీ లో చేరడం ఇదే ప్రప్రథమo అన్నారు. తానెప్పుడూ అధికారంకోసం ప్రాకులాడనని, ప్రజలు ఎవరి వెంట నడుస్తారో తాను వారి వెంటే నడుస్తానని అయన స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షాల ఆహ్వానం మేరకే దేశానికి సేవ చేసేందుకు తాను బీజేపీ లో చేరానని చెప్పారు.



ప్రాంతీయ పార్టీలతో అభివృద్ధి సాధ్యం కాదని అందుకే తమ ప్రాంత అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ లో చేరానని తెలిపారు. గత పాలకులు తమ స్వార్థం కోసం ముస్లింలను పావులుగా వాడుకున్నారని విమర్శించారు.  అంతేకాకుండా బీజేపీపై ముస్లిం వర్గాల్లో తప్పుడు ప్రచారం చేసి,భయాందోళనలు సృష్టించాయన్నారు. తాను ఎల్లప్పుడూ హిందూ, ముస్లింల  మధ్య సోదరభావం నెలకొల్పేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ముస్లింలకు సామూహిక వివాహాలు జరుపుతున్నానని ఈ సందర్భంగా ప్రస్తావించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు కర్నూలు ప్రజలకు తాగునీటి సమస్య వుండేదికాదన్నారు. ప్రస్తుత పాలకులు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేక పోతున్నారని విమర్శించారు. బీజేపీలో చేరినందుకు దేశానికి సేవ చేసే భాగ్యం లభించిందన చెప్పారు. ఇప్పటికే పలు కీలక బిల్లుల ఆమోదించడానికి తాను మద్దతు ఇచ్చానని టీజీ వెంకటేష్ చెప్పారు. రానున్న రోజుల్లో కర్నూలు ముస్లింల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని చెప్పారు. ఇందుకు  ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించనున్నట్టు వెంకటేష్ పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాలింగి నరసింహ వర్మ, యోగానంద చౌదరి, తదితరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: