21 సంవత్సరాలు ఆలస్యంగా గ్రామస్తులు కోర్టుకు  వచ్చి  తమ నుండి స్వాధీనం చేసుకున్న భూమికి సరైన పరిహారం ఇవ్వాలన్న రైతుల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు నేడు తిరస్కరించింది.


1980లో ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడా-దాద్రి హైవే సమీపంలో ఉన్న గుల్సితాపూర్ మరియు టిల్ప్టా గ్రామస్తుల నుండి భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో వారికి చదరపు గజానికి 20 నుండి 22 రుపాయలు ఇచ్చారు.


 నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కస్నాలో తమ పొరుగువారికి   పరిహారం రేటును సుప్రీంకోర్టు 2016 లో 65 రుపాయలు గా నిర్ణయించింది. కస్నా కేసులో విజయం‌  తెలుసుకున్న గుల్సితాపూర్  రైతులు  తమకూ‌ అంతే ఇవ్వాలని కోర్టుని ఆశ్రయించారు.   గుల్సితాపూర్ మరియు టిల్ప్టా రైతులు కూడా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (యుపిఎస్ఐడిసి) మరియు గ్రేటర్ నోయిడా పారిశ్రామిక అభివృద్ధి అథారిటీని కోర్టుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.  గుస్లితాపూర్  కు కస్నా కేవలం  నాలుగు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది.



సుప్రీం కోర్టు  విచారణ సమయంలో, కస్నాలో కొనుగోలు ఒప్పందం గుల్సితాపూర్ మరియు టిల్ప్టా గ్రామస్తులతో చేసిన ఒప్పందం తర్వాత నాలుగేళ్ల కు జరిగింది. కనుక వాళ్లకు ఇచ్చిన పరిహారమే వీరికి కూడా ఇవ్వలేమని వారి తెలిపారు. అంతే కాకుండా మీరు 'చాలా ఆలస్యంగా 21 సంవత్సరాల తర్వాత ' వచ్చారు అని  కూడా తెలిపారు.


కానీ రైతులు గుల్సితాపూర్ మరియు టిల్ప్టాలో స్వాధీనం చేసుకున్న భూముల కన్నా తమ భూములు చాలా మంచివని,జాతీయ రహదారి నోయిడా - దాద్రి రహదారి లో‌ ఉన్నాయని కోర్టుకు తెలిపారు.  సుప్రీంకోర్టు అధికారులతో అంగీకరించి, గుల్సితాపూర్ మరియు టిల్ప్టా గ్రామస్తులు కస్నా లోని అభివృద్ది చెందిన ప్రాంతం గా దృష్టి లో  పెట్టుకుని  దాని ఆధారంగా అధిక పరిహారం పొందలేరని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: