తెలుగుదేశం  పార్టీలో ఎపుడేం జరుగుతుందో ఎవరికీ అంతుచిక్కడంలేదు. కొన్ని ఫిరాయింపులు హై కమాండ్ స్క్రిప్ట్ ప్రకారం జరుగుతూంటే, మరికొన్ని  షాకిచ్చేలా సాగుతున్నాయి. ఏది ఏమైనా జగన్ లాంటి సీఎం ఉన్నపుడు చంద్రబాబు హ్యాపీ నిద్రపోవచ్చు. కానీ మధ్యలో కొంతమంది చేస్తున్న అలజడి, పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలతో చంద్రబాబు బేజారవుతున్నారుట.


ఇక విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చాన్నాళ్ళ తరువాత మీడియా ముందుకు వచ్చారు. దాదాపుగా మూడు నెలల పాటు ముఖం చూపించని ఈ మాజీ మంత్రి గారు ఇపుడు తాపీగా పార్టీ మీటింగ్ పెట్టారు. తాను గెలిచిన ఉత్తర నియోజకవర్గంలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో జరిగిపిన సమావేశంలో తాను టీడీపీని వీడిపోనని చెప్పుకొచ్చారు.


తాను అసలు ఎందుకు పార్టీ మారుతానంటూ గంటా ప్రశ్నించారు.  తనని గెలిపిచిన ప్రజలకు జవాబుదారిగా ఉంటానని ఆయన గట్టిగా చెప్పారు. తాను ప్రతిపక్ష పాత్ర పోషిస్తానని కూడా వెల్లడించారు. తన మీద వస్తున్న ప్రచారం, పార్టీ మారుతున్నట్లుగా చేస్తున్న దాన్ని ఆయన ఖండించారు. అయినా ప్రతీసారి మీడియా ముందుకు వచ్చి తాను చెప్పాల్సిన అవసరం లేదని కూడా అన్నారు.


టీడీపీలో కొనసాగుతూ పార్టీ అభివ్రుధ్ధి కోసం క్రుషి చేస్తానని గంటా అన్నారు. మరి గంటా పక్కా క్లారిటీ ఇచ్చాకనైనా టీడీపీకి నమ్మకం కుదురుతుందా అన్నదే ఇక్కడ డౌట్. చంద్రబాబు విషయనికి వస్తే ఇవన్నీ తెలియని నాయకుడు కాదు, గంటా పార్టీలో ఉంటానంటే ఆయనకు అవకాశలు ఎక్కడా లేక ఉంటున్నారా, లేక నిజంగానే ఉంటున్నారా అన్నది కూడా బాబు అంచనా వేసుకునే మాజీ మంత్రి చేసిన తాజా ప్రకటనను నమ్ముతారని అంటున్నారు. మరి చూడాలి బాబు టెన్షన్ ఈ ప్రకటనతో పెరిగిందా తగ్గిందా అన్నది. ఎందుకంటే రాజకీయల్లో కాదంటే  అవుననిలే కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: