గానగంధర్వుడు ఘంటసాల. ఆయన గురించి చెప్పాలంటే ఒక్కటే మాట ఉంది. గాన గాంధర్వుడు శాపవశాత్తు దివి నుంచి భువికి దిగివచ్చి కొన్నాళ్ళు ఉండి శాపవిముక్తి కాగానే తిరిగి తన దివికి చేరుకున్నారని. నిజంగా ఘంటసాల తెలుగుజాతికి ఒక వరం. ఆయన ఓ అద్భుతం. ఆ గొంతులో సరిగమలు పలకాలని ఉబలాటపడతాయి. పాట అలా ప్రవహించాలని ఆరాటపడుతుంది.


ఇక ఘంటశాల పదివేలకు పైగా పాటలు పాడారు. ఆయన చివరి రోజుల్లో భగవద్గీత అందించి తెలుగు జాతిని ధన్యులను చేశారు. ఇక ఘంటసాల వందకు పైగా సినిమాలకు సంగీత  దర్శకత్వం వహించి ఆ రోజుల్లోనే రికార్డ్ స్రుష్టించారు. సొంతవూరు వంటి సినిమాలను కూడా నిర్మాతగా తీశారు. ఆయన శ్రీ వెంకటేశ్వర మహత్స్యం సినిమాలో తన ఇలవేలుపు అయిన ఆ స్వామి వారిని కీర్తించే  పాటలో వెండి తెరపై కనిపిస్తారు.


ఇక ఘంటశాల 1922లో క్రిష్ణా జిల్లాలో చౌటుపల్లిలో డిసెంబర్ 4న పుట్టారు. 1974 ఫిబ్రవరి 11 న ఆయన ఆ దైవసన్నిధానానికి చేరుకున్నారు. ఘంటసాల కేవలం 51 ఏళ్ళు మాత్రమే జీవించారు. కానీ అజరామరమైన కీర్తిని ఆర్జించారు. ఘంటసాల చివరి రోజుల్లో పాటలు పాడడం కష్టమయ్యేది. ఆయనే  పాడాలని ఎంతో మంది నిర్మాతలు, హీరోలు, దర్శకులు వత్తిడి చేసేవారు. ప్పట్లో కొత్తగా ఎస్పీ బాలు, రామక్రిష్ణ వంటి గాయకులు సినీ సీమలో ప్రవేశించారు. 


ఘంటసాల వారికి అవకాశాలు ఇవ్వండని చెప్పి చాలావరకూ  తాను పక్కకు తప్పుకునేవారు. అయితే కొన్ని సినిమాలకు ఘంటసాల పాటలు, పధ్యాలు ఉండాలని పట్టుపట్టడంతో ఆయన పాడక తప్పింది కాదు. అలా అన్న నందమూరి నిర్మించిన శ్రీక్రిష్ణ సత్య సినిమాలో రాయబారం పద్యాలను ఘంటసాల కొన్ని పాడారు, మరి కొన్ని పాడలేకపోయారు. దాంతో బాలు వాటిని పాడి గొంతు సాయం చేశారు.


ఇక క్రిష్ణ తీసిన అల్లూరి సీతారామరాజు మూవీలో తెలుగు వీర లేరా పాటకు కూడా ఘంటసాల చాలావరకూ పాడి ఇక నా వల్లకాదు అంటే రామక్రిష్ణ  మిగిలిన పాటను పూర్తి చేసి తన గొంతు మ్యాచ్ చేశారు. అలాగే ఘంటసాల చనిపోయేనాటికి మిగిలిన సినిమాల‌ను అటు బాలు, ఇటు రామక్రిష్ణ పాడి ఆ మహా గాయకుడి రుణం తీర్చుకున్నారు. ఆయన వారసులుగా పేరు సంపాదించుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: