భారత్ తో కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వాణిజ్య సంభందాలు తెంచుకున్న సంగతీ తెలిసిందే. అయితే ఇది వరకే చెప్పుకున్నట్టు భారత్ తో వాణిజ్య సంభందాలు తెచ్చుకోవటం వల్ల భారత్ కు వచ్చిన నష్టమేమి లేదని పాకిస్థాన్ కే నష్టమని చెప్పుకున్నాము. ఎందుకంటే భారత్ — పాకిస్తాన్ మధ్య వాణిజ్య వ్యాపారాలు నామమాత్రమేనని చెప్పాలి. భారత్ ఎక్కడో ఉన్న అమెరికాతో భారీగా వాణిజ్య వ్యాపారాలు చేస్తుంది గాని పక్కనే ఉన్న పాకిస్థాన్ తో పెద్దగా ఎగుమతులు దిగుమతులు లేవని చెప్పాలి. ఇంకా భారత్ .. పాకిస్తాన్ కు నిత్యావసర వస్తువులు ఎగుమతి చేస్తుంది. అంటే టమోటాలు, ఉల్లిపాయలు మొదలైనవి ఎగుమతి చేస్తుంది. అయితే ఇప్పుడు అవన్నీ ఆగిపోవటం చేత ఇప్పుడు పాకిస్తాన్ లో ఆ వస్తువులు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో టమోటాలు ధర 300 రూపాయలు .. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు. పాకిస్తాన్ లో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ..!


పాకిస్థాన్ లో ఉన్న మేధావి వర్గం కూడా ఆ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. భారత్ తో వాణిజ్య సంభందాలు తెంచుకోవద్దని ..  కానీ పాక్ ప్రధాని భారత్ మీద ఎక్కడ లేని కోపానికి పోయి చివరకి ఆ దేశ ప్రజలు కోపానికి కారకుడవుతున్నారు. ఇప్పటికే ప్రజలు బక్రీద్ పండుగకు నిత్యావసర వస్తువులు దొరక్కా తమ కష్టాలు చెప్పుకుంటూ, ఇమ్రాన్ ఖాన్ ను దుమ్మెత్తి పోస్తున్నారు. 


ఇప్పుడు పాకిస్తాన్ కు నిత్యావసర వస్తువులు ఎగుమతి చేసే భారత్ దూరమవటంతో అక్కడ రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 100 కోట్ల పైగా జనాభా ఉన్న భారత్ మార్కెట్ ను పాక్ కోల్పోవడంతో ఈ కష్టాలను ఏరి కోరి తెచ్చకుంది. ఇప్పటికే  జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ .. పాకిస్తాన్ వాణిజ్య సంభందాలు తెచ్చుకోవటం వల్ల భారత్ కు వచ్చిన నష్టం కేవలం కోహ్లీ తన ఇన్ స్టాగ్రాం లోఒక వాణిజ్య ప్రకటనకు అయ్యే ఖర్చు మాత్రమేనని .. అదిరిపోయే సెటైర్ వేసిన సంగతీ తెల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: