ప్రేమ.. ఈ రెండు అక్షరాలా మాట ఎన్నింటినైనా మార్చేయగలదు.  ఎంతటి సాహసాలనైనా చేయించగలదు.  ప్రేమ అన్నది ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎలాంటి వ్యక్తుల మధ్యనైనా పుట్టొచ్చు.  ప్రేమించుకోవడానికి వయసు, కులం, మతం, ఆస్తి, అంతస్తులు అవసరం లేదు.  సినిమా డైలాగుల్లా ఉన్నా ఇది నిజం.  ప్రేమ గురించి చెప్పాలి అంటే లైలా మజ్ను, దేవదాస్ పార్వతి.. రోమియో జూలియట్ ఇలా చెప్పుకుంటూ పోతారు.  


చరిత్రలో నెపోలియన్ చక్రవర్తి అంటే వామ్మో అని భయపడతారు.  ఒక సామాన్య సైనికుడిగా చేరి అంచెలంచెలుగా దిగి సైన్యాధ్యక్షుడిగా ఎదిగాడు.  అక్కడితో ఆగకుండా ఫ్రాన్స్ దేశానికి చక్రవర్తి అయ్యాడు.  ఎంతవారలైన కాంత దాసులే అన్నట్టుగా ఈ చక్రవర్తి 32 ఏళ్ల వయసులో ఉండగా..అంటే 1796 వ సంవత్సరంలో జోసెఫిన్ను అనే 26 ఏళ్ల వితంతువును వివాహం చేసుకున్నారు.  ఆమె అంటే నెపోలియన్ చక్రవర్తికి ప్రాణం.  


యుద్దాలు చేయాలి, రాజ్యాలు ఆక్రమించుకోవాలని నెపోలియన్ చక్రవర్తికి పెద్ద కోరిక.  ఎప్పుడు యుద్దాలు చేసేవారు.  అందుకే కుటుంబానికి దూరంగా ఉన్నాడు.  దూరంగా ఉన్న భార్యపై ప్రేమ మాత్రం తగ్గలేదు.  ఓ సందర్భంగా ఆయన తన ప్రేమసి, భార్య జోసెఫిన్నుకు ప్రేమలేఖ రాశాడు. మీనుంచి నాకు ఎటువంటి లేఖ రాలేదు.  నేను బాగా అలసిపోయి ఉన్నాను.  ఇప్పుడు నాకు మీరు గుర్తుకు వస్తున్నారు అనే సారాంశంతో ఉన్న లేఖ అది.  


వితంతువు అయినప్పటికీ ఆమె అంటే నెపోలియన్ కు తెలియని ప్రేమ.  కొంతకాలం తరువాత ఆమెకు విడాకులు ఇచ్చి ఆస్ట్రియాకు చెందిన మేరీ లూయిన్ను పెళ్లి చేసుకున్నాడు.  పెళ్లి మేరీని వివాహం చేసుకున్నా.. జోసెఫిన్నుపై ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు.  తన చివరి క్షణాల్లో కూడా నెపోలియన్ మొదటి భార్య జోసెఫిన్నును తలచుకుంటూనే మరణించాడట.  ఇదిలా ఉంటె, నెపోలియన్ చక్రవర్తి తన మొదటిభార్య జోసెఫిన్నుకు రాసిన ప్రేమ లేఖను ఇటీవలే వేలం వేశారు.  ఈ లేఖ దాదాపుగా రూ. 4 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినట్టు తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: