జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎల్లోమీడియా రియల్ ఎస్టేట్ రంగంపై ఒకటే గోల చేస్తోంది. తాజాగా కూడా బ్యానర్ గా ఓ కథనాన్ని వండి వార్చింది. అమరావతి పరిధిలో ప్రత్యేకించి తుళ్ళూరు మండలం పరిధిలో రియల్ ఎస్టేట్ బూమ్ పడిపోయిందంటూ నానా గోల చేస్తోంది. ఇంతకీ ఎల్లోమీడియా గోల ఎవరి కోసమో అర్ధం కావటం లేదు.

 

నిజానికి రియల్ ఎస్టేట్ ధరలు ఇంటి స్ధలాలు కావచ్చు లేదా ఫ్లాట్ల ధరలు కావచ్చు ఎంత తక్కువుంటే అంత డిమాండ్ పెరుగుతుంది. కొనుగోలుదారుల్లో ఎక్కువగా మధ్య తరగతి జనాలే  ఉంటారనటంలో సందేహం లేదు. రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశన్నంటిన సమయంలో వీళ్ళెవరూ కనీసం కొనే ఆలొచన కూడా చేయలేరు. అదే ధరలు గనుక తగ్గిపోతే ఎక్కువమంది కొనుగోలుకు ఆసక్తి చూపుతారు.

 

మరి ఈ విషయం ఎల్లోమీడియాకు తెలీదా ? రియల్ ఎస్టేట్ రంగంలో ధరలు పడిపోతోందని ఒకటే గోలెందుకు చేస్తోంది ? ఇక్కడే ఎల్లోమీడియా కొనుగోలుదారుల తరపున మాట్లాడుతోందా ? లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారుల తరపున వకాల్తా పుచ్చుకుందా అన్నదే అర్ధం కావటం లేదు.

 

కొనుగోలుదారుల తరపున మాట్లాడేట్లయితే ధరలు ఇంకా తగ్గాలని ఆశించాలి. అప్పుడు ఎక్కువమంది కొనుగోలుకు ప్రయత్నిస్తారు. అలా కాకుండా రివర్సులో కథనాలు వండి వారుస్తోందంటే అర్ధమేంటి ? రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు మద్దతుగానే రంగంలోకి దిగి కథనాలు ఇస్తోందన్న విషయం ఎవరికైనా తెలిసిపోతుంది.

 

రియల్ ఎస్టేట్ వ్యాపారసంస్ధలకు ఎందుకు మద్దతుగా నిలుస్తోందంటే అందులో ఎక్కువమంది చంద్రబాబునాయుడు సామాజికవర్గం వాళ్ళు లేకపోతే అత్యధికులు తెలుగుదేశంపార్టీకీ కలక నేతలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు కాబట్టే అని అనుమానించాల్సొస్తోంది. చంద్రబాబు వల్ల అప్పట్లో లాభపడిన వాళ్ళకు ఇపుడు ఇబ్బందులు మొదలయ్యాయన్నదే ఎల్లోమీడియా బాధ. అంటే కేవలం ఓ సెక్షన్ బాధలను ప్రపంచ బాధగా ఎల్లోమీడియా ప్రొజెక్టు చేస్తోందంతే.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: