ఏపీలో అధికార పార్టీకి సుమారు 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే, ప్రధాన ప్రతి పక్షం అయిన టీడీపీ పార్టీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇంకొక పక్క బీజేపీ .. టీడీపీ పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకున్ని వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే తెలుగు దేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీ ఖండువా కప్పుకున్నారు. ఇక మిగిలిన చిన్నా, చితక నాయకులూ జిల్లా స్థాయి నాయకులను సైతం బీజేపీ వదిలి పెట్టడం లేదు. ఎవరు వచ్చింది వెంటనే ఖండువా కప్పి ఆహ్వానిస్తున్నారు. దీనితో టీడీపీ పార్టీ ఉనికే ప్రశ్నర్ధకంగా మారింది. ఇంకొక పక్క కేసీఆర్ కుడా ఇదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను లాగేసి చివరికి ఆ పార్టీకి ప్రతి పక్ష హోదా కూడా లేకుండా చేసి శాసన సభ పక్షాన్ని కూడా తెరాస లో విలీనం చేశారు. 


అయితే ఏపీలో జగన్ మాత్రం ఆ దిశగా ఆలోచించడం లేదు. నిజంగా జగన్ గాని ఒకే ఒక చూపు చూస్తే టీడీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో .. చివరికి బాబుగారికి కూడా తెలుసు. ఒక సారి జగన్ కూడా అసెంబ్లీలో ఇదే విషయాన్ని హెచ్చరించాడు. నేను గాని తలుచుకుంటే టీడీపీ పార్టీకి ప్రతి పక్ష హోదా కూడా ఉండదని చెప్పిన సంగతీ తెలిసిందే. అయితే నేను అటువంటి పనులు చేయనని .. జగన్ నిజాయితీగా చెప్పుకొచ్చారు. 


అయితే జగన్ ఇచ్చిన హామీ వల్లే చంద్రబాబు కూడా తన పార్టీలో ఫిరాయింపులు గురించి పెద్దగా భాదపడటం లేదు. తెలంగాణ లో కేసీఆర్ మాదిరిగా జగన్ కూడా ఫిరాయింపులు ప్రోత్సహిస్తే ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది. ఆ పార్టీ ఏపీలో ఇక చచ్చిపోయినట్టే .. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా అయ్యేదో అలా అయిపోతుంది. అయితే జగన్ మాత్రం అటువంటి పనులు చేయకుండా టీడీపీ పార్టీని బతికిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: