కోడిగుడ్డు ధర ఎంత ఎక్కువ అనుకున్నా మహా అయితే 5 నుంచి 10 రూపాయలు ఉంటుంది.  ఇంకా ఎక్కువ అనుకుంటే.. ఇంకో రెండు మూడు రూపాయలు అదనం అనుకోవచ్చు.  ఉడకబెట్టిన గుడ్డు బయట 10, హోటల్ లో అయితే దాని రేంజ్ ను బట్టి 20 నుంచి 50 వరకు ఉంటుంది.  అంతకు మించి ఎక్కువ ఉండదు.  అలా ఉన్నది అంటే అది కోడిగుడ్డు కాదు మరేదో గుడ్డు అయ్యి ఉంటుంది.  


కాదండి బాబు కోడిగుడ్డు ధరే 1700 అంటున్నారు.  కళ్ళుతిరిగి కిందపడుతున్నారా.. ఈ స్టోరీ మొత్తం చదివితే కళ్లేంటి అన్ని తిరుగుతాయి.  ఇటీవలే కార్తీక్ అనే వ్యక్తి ముంబైలోని ఫర్ సీజన్ అనే హోటల్ కు వెళ్ళాడు.  రెండు ఉడకబెట్టిన లెగ్స్, ఒక ఆమ్లెట్ తో పాటు మిగతా కొన్ని ఫుడ్ ఐటమ్స్ ను ఆర్డర్ చేశారు.  ఆర్డర్ వచ్చిన తరువాత హ్యాపీగా తినేశాడు.  ఆ తరువాత వచ్చిన బిల్ ను చూసి తిన్నది మొత్తం దెబ్బకు అరిగిపోయింది.  


బాప్ రే ఇదేంటి.. ఈ బిల్లు ఏంటి అని మొత్తుకున్నాడు.  తిన్నాక తప్పదు కదా బిల్లు కట్టి బయటకు వచ్చిన తరువాత ఆ విషయాన్ని పాపం నెటిజన్లతో పంచుకున్నాడు.  ఉడకబెట్టిన రెండు కోడిగుడ్ల ధర రూ. 1700 /- ఛార్జ్ చేశారని.  ఒక ఆమ్లెట్ ధర రూ. 830/- ఛార్జ్ చేశారని సోషల్ మీడియాతో పంచుకున్నారు.  ఆ బిల్లు చూసి నెటిజన్లు  కూడా షాక్ అయ్యారు.  బ్రదర్ మీరు తిన్నది మాములు కోడి గుడ్ల లేదంటే బంగారం కోడిగుడ్ల అనే కామెట్స్ చేస్తున్నారు.

కామెంట్స్ సంగతి పక్కన పెడితే.. ఇలా కోడిగుడ్డు ధర అంత వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.  ఇలానే వదిలేస్తే భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి ఎన్నో బయటకు వస్తాయని అంటున్నారు.  ఇటీవలే బాలీవుడ్ హీరో రాహుల్ బోస్ కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.  రెండు అరటిపండ్లు ఆర్డర్ చేస్తే.. వాటి ధర ఏకంగా రూ. 442/- వేయడంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.  ఆహోటల్ పై చర్యలు కూడా తీసుకున్నారనుకోండి.  మొన్న అరటిపండ్లు గురించి రచ్చ జరిగితే ఇప్పుడు కోడిగుడ్డు గురించి చర్చ జరుగుతున్నది.  రేపు దేని గురించి చర్చ జరుగుతుందో మరి.  


మరింత సమాచారం తెలుసుకోండి: