మిగిలిన దేశం సంగతి ఎలాగున్నా ఏపిలో మాత్రం బిజెపి నేతలు చంద్రబాబునాయుడునే ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది. రెండు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలే కదా బిజెపి చంద్రబాబును ఫాలో అవటం ఏమిటనుకుంటున్నారా ?  జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించటంలో మాత్రం రెండు పార్టీలు ఏకమైనట్లే అనుమానంగా ఉంది.

 

విషయం ఏమిటంటే  వైసిపి  అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు అండ్ కో జగన్ ను గుడ్డిగా వ్యతిరేకిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. విషయం ఏదైనా కానీండి జగన్ ను వ్యతిరేకించటమే టార్గెట్ గా చంద్రబాబు పెట్టుకున్నారు. ప్రస్తుతం పార్టీ వన్ పాయింట్ అజెండా మొత్తం  జగన్ ను వ్యతిరేకించటం చుట్టూనే నడుస్తోంది.

 

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు అండ్ కో ఆరోపిస్తున్నట్లుగా లా అండ్ ఆర్డర్ ఏమీ గతి తప్పలేదు. ఎక్కడో రెండు పార్టీల నేతల మధ్య వ్యక్తిగత తగాదాలుంటే వాటిని కూడా టిడిపిపై వైసిపి దాడులుగా చిత్రీకరిస్తున్నారు. కొన్ని చోట్ల వైసిపి నేతలు ఓవర్ యాక్షన్ చేస్తుండచ్చు. అంతమాత్రాన రాష్ట్రమంతా అరాచకాలు జరిగిపోతున్నాయంటే ఎవరూ నమ్మేట్లు లేదు.

  

అదే సమయంలో బిజెపి నేతలు కూడా జగన్ వ్యతిరేక ప్రచారాన్ని స్పీడ్ చేశారు. రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నాయని, అవినీతి పెరిగిపోతున్నాయంటూ మండిపోతున్నారు. పరిపాలనలో జగన్ కూడా చంద్రబాబును ఫాలో అవుతున్నారంటూ వచ్చే ఎన్నికల్లో వైసిపికి టిడిపికి పట్టిన గతే పడుతుందంటూ శాపనార్ధాలు పెట్టటమే విచిత్రంగా ఉంది.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పరిపాలనలో చంద్రబాబును జగన్ ఫాలో అవటం లేదు. జగన్ ను గుడ్డిగా వ్యతిరేకించటంలో బిజెపి నేతలే చంద్రబాబును ఫాలో అవుతున్నారు. ముందు జగన్ కు వ్యతిరేకంగా చంద్రబాబు-బిజెపి కలిస్తే తర్వాత ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ను కూడా కలుపుకుంటారేమో తెలీదు. అంటే 2024 ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి 2014 ముఖచిత్రమే రిపీటయ్యేట్లుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: