గుడ్డు పేలింది..అదేంటీ గుడ్డు పేలడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా..అబ్బే గుడ్డు పేలడం అంటే  గుడ్డు రేటు తిమ్మతిరిగే షాక్ ఇచ్చిందని అర్థం.  వివరాల్లోకి వెళితే.. సాధారణంగా మార్కెట్ లో గుడ్డు రైలు ఐదు రూపాయలు..అయితే ఇది హోటల్స్, ఇతర చిన్న చిన్న షాపుల్లో ఉడక బెట్టి అమ్మితే మహా అంటే పది రూపాయలు, ఇక ఆమ్లేట్ వేస్తే ఇరవై నుంచి ఐభై రూపాయల వరకు రేటు ఉంటుంది.  ఇక కాస్త పెద్ద పెద్ద హూటల్స్ లో దీని రేటు మహా అంటే వంద రూపాయల వరకు చార్జి చేస్తుంటారు. 

ఒక పెద్ద పెద్ద 5స్టార్ హూటల్లో సైతం రెండు వందలు అంటే మహాఎక్కువ..అలాంటిది ఓ ప్రముఖ హోటల్‌లో రెండు ఉడకబెట్టిన గుడ్లకు ఏకంగా రూ.1700 బిల్లు వేయడంతో కస్టమర్ కి కళ్లు బైర్లు కమ్మాయి.  ఇటీవల ప్రముఖ నటుడు ‘దిల్ దడక్‌నే దో’ ఫేమ్ రాహుల్‌ బోస్‌కు చండీగఢ్‌లోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ కేవలం రెండు అరటి పండ్లు తెప్పించుకుని తిన్న పాపానికి ఏకంగా రూ.442.50 బిల్లు వేయడంతో దిమ్మతిరిగి హీరో అరటిపండ్లు దాని తాలూకు బిల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.  ఆ తర్వాత ఆ హూటల్ పై చండీగఢ్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

తాజాగా  రెండు ఉడకబెట్టిన గుడ్లకు ఏకంగా రూ.1700 బిల్లు వేయడంపై మరోసారి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతుంది. ఆల్‌ ద క్వీన్స్‌ మెన్‌’ పుస్తక రచయిత కార్తీక్‌ ధర్‌ ఈ నెల 10న ముంబయిలోని ఫోర్‌ సీజన్స్‌ హోటల్‌కి తనకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేశారు.  అందులో  రెండు ఉడకబెట్టిన గుడ్లు, ఆమ్లెట్లతో పాటు మరికొన్ని ఐటెమ్స్‌ ఆర్డర్‌ ఉన్నాయి.

ఇక ఫుడ్ బాగుంది కదా అని మనూడో పూర్తిగా తిన్న తర్వాత బిల్లు చూసి మైండ్ బ్లాక్ అయ్యింది. కేవలం రెండు ఉడకబెట్టిన గుడ్లకు రూ.1700, ఒక ఆమ్లెట్‌కు రూ.850 వేయడంతో ఏం చేయాలో పాలుపోక బిల్ పే చేసి  తన ఆవేదనను ట్విటర్‌ వేదికగా నెటిజన్స్ తో పాలుపంచుకున్నాడు.  అంతే కాదు ఆ ట్వీట్ లో సోదరా నిరసన కార్యక్రమం చేపడదామా’ అంటూ తన తోటి బాధితుడైన రాహుల్‌ బోస్‌ను తన పోస్ట్‌కి ట్యాగ్‌ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: