అధికారం చేప‌ట్టిన రెండు నెల‌ల్లోనే వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పాల‌న‌లో త‌న‌దైన ముద్ర‌వేస్తున్నాడు. కేవ‌లం రెండు నెల‌ల్లోనే జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన ఎన్నో సంస్క‌ర‌ణ‌లు దేశ‌వ్యాప్తంగా త‌ల‌పండిన రాజ‌కీయ మేథావుల‌కు సైతం షాక్ ఇచ్చాయి. ఎక్క‌డా అవినీతి అన్న ప్ర‌స్తావ‌న లేకుండా పాల‌న అందించేందుకు ఆయ‌న క‌ష్ట‌ప‌డుతున్నారు. ఏ మంత్రి లేదా ఎమ్మెల్యే బోర్డ‌ర్ దాటుతున్నా జ‌గ‌న్ సీరియ‌స్‌గా వార్నింగ్‌లు ఇస్తున్నారు. జ‌గ‌న్ నిర్ణ‌యానికి..యువ‌త నుంచే గాకుండా అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. 


కొత్త‌గా ఏ ప‌రిశ్ర‌మ పెట్టినా అందులో 75 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కే ఇవ్వాల‌న్న డిమాండ్‌ను కూడా జ‌గ‌న్ తెర‌మీద‌కు తీసుకువ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఉద్యోగాలు ఇచ్చిన ప‌రిశ్ర‌మ‌లు భ‌విష్య‌త్ రిక్రూట్‌మెంట్లో స్థానికుల‌కే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాల‌ని కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆదేశించింది. ఇక ఇప్పుడు జ‌గ‌న్‌ను క‌న్న‌డ సూప‌ర్ స్టార్‌, ప్రముఖ న‌టుడు ఉపేంద్ర ఫాలో అవుతున్నారు. కర్ణాటకలో ఉద్యోగాలన్నీ కన్నడిగులకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. 


క‌న్న‌డ ఉద్యోగాలు క‌న్న‌డీగుల‌కే ఇవ్వాల‌న్న టార్గెట్‌తో ఉపేంద్ర ఆగస్ట్‌ 14, 15వ‌ తేదీల్లో ఉపేంద్ర నిరాహారదీక్ష చేపట్టనున్నారు. ఇప్పుడు ఈ విష‌యంలో క‌ర్ణాట‌క‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఉపేంద్ర డిమాండ్‌కు కూడా మంచి స్పంద‌న ల‌భిస్తోంది. స్వతహాగా బెంగళూరు ఐటీ రాజధాని కావడంతో దేశ నలుమూలల నుంచి ఉపాధి కోసం అక్కడికే వస్తుంటారు. దీంతో స్థానికులకు అన్యాయం జరుగుతుందనే వాదన ఎప్పటి నుంచో ఉంది.


ఈ నినాదం ఎత్తుకోవ‌డంతో ఉపేంద్ర ఇప్పుడు క‌న్న‌డ నాట పాపుల‌ర్ అయిపోయాడు. ప్ర‌తి ఒక్క‌రు ఉపేంద్ర‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఇక జ‌గ‌న్ ఏపీలో తీసుకున్న నిర్ణ‌యంతో చాలా మంది మోటివేట్ అవుతున్నారు. ప్ర‌ధానంగా ఇత‌ర రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌ను, మిగ‌తా వ‌ర్గాల‌ను కూడా జ‌గ‌న్ నిర్ణ‌యాలు ఆలోచింప‌జేస్తున్నాయి. ఇందులో భాగంగానే క‌న్న‌డ న‌టుడు ఉపేంద్ర క‌ద‌ల‌గా... రేపు మ‌రెంత మంది ముందుకు క‌దులుతారో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: