మొన్నటికి మొన్ననే ప్రతి ఒక్కరి మనసు కలవరపరచిన 9 నేలల ముక్కుపచ్చలారని బాలిక, శ్రీహితా పై అతి దారుణంగా అత్యాచారానికి గురైయి మరణించిన సంఘటన మనందరికి తెలిసిందే. ఈ విషయం ప్రతి ఒక్కరి మనసు కదిపేసింది.ఇప్పుడు మళ్లీ ఇలాంటి ఒక విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. రికార్డు స్థాయిలో నలభై ఎనిమిది రోజులలో జడ్జ్ ఒక న్యాయమైన తీర్పు ఇచ్చిన తరువాత కూడా ఇలాంటి సంఘటనలకు ఎవరు పాల్పడారనే భావించినా ఈ సంఘటన చోటు చేసుకోవడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. బాలికను ముగ్గురు యువకులు మాయ మాటలతో నమ్మించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అవమానాన్ని తట్టుకోలేక బాలిక ప్రాణం తీసుకుంది. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో విషాదం చోటుచేసుకుంది.


హన్మకొండ సమ్మయ్యనగర్ లో ఓ మహిళ ఆమె మనవరాలైన పదిహేనేళ్ల బాలిక ఉంటున్నారు. పెంబర్తికి చెందిన తిరుపతి ప్రసన్న కుమార్, రాకేష్ డీజే నిర్వహిస్తూ ఉన్నారు. వీరితో వెన్నెలకు పరిచయం ఏర్పడింది. శనివారం ఉదయం పదకొండు గంటలకు వెన్నెలను ఇంటికి తిరుపతి, ప్రసన్న వచ్చి ఆమెను బైక్ మీద పెంబర్తి రోడ్డులోని ఓ తోటకు తీసుకెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న రాకేష్, తిరుపతి, ప్రసన్నలతో కలిసి బాలికపై దారుణానికి పాల్పడ్డారు. సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు బాలికను ఇంటి వద్ద దిగబెట్టి వెళ్లిపోయారు. తనకు జరిగిన దారుణాన్ని నాన్నమ్మకు చెప్తూ తనకు ఇంజెక్షన్ కూడా ఇచ్చారని చెప్పుకొని వాపోయింది. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళ నాన్నమ్మ యువకులతో మరుసటి రోజు మాట్లాడాలని అనుకుందట. తెల్లవార్లు యువకులకు బాలిక ఫోన్ లు చేసి మాట్లాడినట్లు సమాచారం వెల్లడైయ్యింది. ఏం జరిగిందో ఏమో కానీ ఆదివారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు బాలిక చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.


బాలిక మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె బంధువు లు ఎంజీఎం మార్చురీ దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు. హన్మకొండ సమ్మయ్యనగర్ కు చెందిన సిరిగల వెన్నెల అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషయాన్ని తెలుసుకున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లి మార్చురీలో వెన్నెల మృతదేహానికి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. శ్రీహిత సంఘటన మరవక ముందే తొమ్మిదో తరగతి విద్యార్థి వెన్నెల సంఘటన జరగడం చాలా బాధాకరంగా ఉందని వినయ్ భాస్కర్ వ్యక్తం చేశారు. మొన్ననే ఉన్మాది ప్రవీణ్ కు ఉరిశిక్ష విధించినా ఇంకా మారని మృగాలను వెంటనే కఠినంగా శిక్షించేలా చూస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన విధంగానే పోలీసులు ఆ నిందితులను అదుపులోకి తీస్కున్నారు. వారిని కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులు కూడా విజ్ఞప్తి చేశారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వారిలో ఒక మైనర్ తో పాటు కూడా ఉండడం విచారం. ఈ సంఘటనకు మన ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వారిపై ఎలాంటి  తీవ్ర చర్యలు తీస్కుంటారో బాలికలకు భద్రత కలిపిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: