భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా  విడదీస్తూ తీసుకున్న సంచలన నిర్ణయం దాయాది దేశం పాకిస్థాన్ కి మింగుడు పడకుండా ఉంది.  అప్పటి నుంచి ఎన్ని రకాల కుట్రలు పన్నాలో అన్ని రకాలుగా పండుతుంది. అంతే కాదు అక్కడి రాయబారిని కూడా వెనక్కి పంపించేసిన విషయం తెలిసిందే. 

ఇప్పటికే పుల్వామా ఘటనకు మన భారత వైమానిక సైనికులు తీసుకున యాక్షన్ కి ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఈ నేపథ్యంలోనే అభినందన్ ఘటన పాక్ ని ప్రపంచ స్థాయిలో బెండ్ చేసింది. ఇప్పుడు కశ్మీర్‌ విభజన, 370 అధికరణ రద్దుతో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో దాయాది దేశం చర్యలు ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి.  ఓపక్క జమ్మూకశ్మీర్ లో దాడులు చేసేందుకు ఉగ్రవాదులను ప్రేరేపిస్తోంది. మరోవైపు, సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది.

ఈ క్రమంలో లడఖ్ సరిహద్దులో ఉన్న స్కర్దూ ఎయిర్ బేస్ కు మూడు సీ-130 యుద్ధ విమానాలను తరలించింది. ప్రస్తుతం పాక్ ఎలాంటి చర్యలు తీసుకోనుంది..మరోసారి ఎదైనా కుట్రలు పన్నుతున్నాయా అనే అంశాలపై  సరిహద్దుల్లో పాక్‌ కదలికలను భారత నిఘా సంస్థ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే భారత్ అన్ని రకాలుగా అప్రమత్తమైంది. సరిహద్దుల వెంబడి నిఘాను ముమ్మరం చేసింది. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కదలికలను భారత నిఘా వ్యవస్థ నిశితంగా గమనిస్తోంది.

ఇటీవల భారత్‌ బాలాకోట్‌ దాడి చేపట్టిన తర్వాత మన గగనతలంలోకి పాక్‌ యుద్ధ విమానాలు దూసుకొచ్చే ప్రయత్నం చేయగా వాటిని భారత వాయుసేన సమర్థంగా తిప్పికొట్టి  గట్టి బుద్ది చెప్పింది. ఎన్ని చేసినా ఇప్పటికీ భారత్ ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది పాక్. 


మరింత సమాచారం తెలుసుకోండి: