ఏపీ సీఎం జ‌గ‌న్‌.. త‌న‌దైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. పాల‌న ప‌గ్గాలు చేప‌ట్టి రెండు నెల‌లే అ యినా దాదాపు చెప్పిన‌వి, చెప్ప‌నివి కూడా క‌ల‌గ‌లిపి.. రెండువంద‌ల‌కు పైగానే ల‌క్ష్యాలు ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నారు. ఒక‌ప‌క్క సంక్షేమం, మ‌రోప‌క్క‌, పాల‌న‌ను ఆయ‌న ప‌ట్టాలెక్కించారు. ఇంకో ప‌క్క అభివృద్ది, నిరుద్యోగంపై స‌మ‌రం సాగిస్తున్నారు. నిజానికి ఏ పార్టీకైనా రెండు నెల‌ల కాలం అంటే పెద్ద‌గా చెప్పుకొనేందుకు ఏమీ ఉండ‌వు. 


మంత్రివ‌ర్గ కూర్పు. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప్ర‌భుత్వ పాల‌న‌ను అవ‌గ‌తం చేసుకోవ‌డం, ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకోవడం వంటి అంశాల‌పై దృష్టి పెట్ట‌డంతోనే ఈ కాలం క‌రిగిపోతుంది. అయితే, జ‌గ‌న్ విష‌యంలో మాత్రం అలా కాదు. రెండు నెల‌ల‌కాలంలోనే ఆయ‌న రెండేళ్ల‌పాల‌న‌ను చూ పించార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌పక్క వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళ‌న చేయ‌డంతోపాటు.. ఆయ‌న అనుకు న్న‌ది సాధించేందుకు అహ‌ర్నిశ‌లూ క‌ష్టిస్తున్నారు. 


ముఖ్యంగా ఎన్నిక‌ల‌కు ముందు నిర్వ‌హించిన పాద యాత్ర‌లో ఆయ‌న ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చేందుకు, న‌వ‌ర‌త్నాలను అమ‌లు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక‌, అవ్వాతాత‌ల‌కు పింఛ‌న్ల‌ను తాను ఎలా అయితే, ఎన్నిక‌ల‌కు ముందు హామీ ఇచ్చారో.. అదేవిధంగా నెర‌వేరుస్తున్నారు. ఇక‌, ఉద్యోగ‌క‌ల్ప‌న విష‌యంలో దేశంలోని ఏ రాష్ట్ర‌మూ సాధించ‌ని రికార్డు దిశ‌గా దూసుకుపోతున్నారు. 


అదేస‌మ‌యంలో పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అభివృద్ది దిశ‌గా ముందుకు న‌డిపించేందుకు జ‌గ‌న్ వేసిన అడుగులు ఫ‌లించే ఛాన్స్ నూటికి నూరుపాళ్లు ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌లే విజ‌య‌వాడ వేదిక‌గా ఆయ‌న 35 దేశాల‌కు చెందిన దౌత్య వేత్త‌ల‌తో ప్ర‌త్యేక పారిశ్రామిక స‌ద‌స్సును ఏర్పాటు చేసి, పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించారు. దీంతో ఆయా దేశాలు కూడా ముందుకు వ‌చ్చేందుకు ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు రెడీగా ఉన్న‌ట్టు ప్ర‌క‌టించాయి. 


నిజానికి ఎంతో అనుభ‌వం ఉన్న నాయ‌కుడిగా ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకు ప‌ట్ట‌గ‌డితే.. ఆయ‌న ఇదే పారిశ్రామిక స‌ద‌స్సును ఏర్పాటు చేసేందుకు దాదాపు ఏడాది కాలం తీసుకున్నారు. కానీ, జ‌గ‌న్ మాత్రం రెండు మాసాల్లోనే రెండింత‌లుగా దూసుకుపోయారు. మొత్తానికి జ‌గ‌న్ ల‌క్ష్యం ముందు కాలం వేగం మంద‌గించిందా! అని అనిపిస్తోంద‌ని అంటున్నారు  విమ‌ర్శ‌కులు సైతం!!


మరింత సమాచారం తెలుసుకోండి: