ఫలితాలు భేష్ -  ముఖేష్

 భారతదేశ దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన 42వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని జరుపుకుంది.   ఈ సమావేశంలో చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

 తమ కంపెనీ పెట్రోకెమికల్స్  సహా టెలికాం, రిటైల్ చెయిన్ స్టోర్స్ వంటి పలు వ్యాపారాలు అడుగు పెట్టి గణనీయమైన అభివృద్ధి తో  ప్రగతి పథంలో దూసుకుపోతుందని ఫలితాలు చాలా బాగున్నాయి శ్రీ ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ సర్వసభ్య సమావేశంలో చెప్పారు.  తమ కంపెనీ త్వరలోనే బ్రిటిష్ పెట్రోలియం తో జత కట్టి సంయుక్తంగా పెట్రోలియం వ్యాపారాన్ని ప్రారంభిస్తుందని ముకేశ్ ఏజీఎం లో చెప్పారు, 

టెలికాం రంగంలో  జియో విప్లవం వలన భారీ విజయం  తమ సొంత అయిందని గుర్తు చేశారు.   తమకు ప్రతి నెల దాదాపు కోటి మంది కొత్త వినియోగదారులు మంచి చేరుతున్నారని తెలిపారు.   తమ కంపెనీలో ఇప్పటికే మూడున్నర కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్టు ప్రకటించారు.  

త్వరలో తమ కంపెనీ అప్పుల అనేవి లేకుండా ఉండే కంపెనీగా మారబోతోంది అన్నారు.   ఇదే జరిగితే భారతదేశ చరిత్రలో ఏమీ అప్పులేని ప్రధమ కంపెనీగా అవతరించడం ఖాయం అని  ఆయన అన్నారు . సౌదీ కంపెనీ ఆ రామ్ కో తమ కంపెనీ లు 30 శాతం వాటా కొనుగోలు చేయునది అని దీనివల్ల భారతదేశ చరిత్రలోనే అత్యధిక విదేశీ  పెట్టుబడులు సాధించిన సంస్థగా తమ కంపెనీ అవతరించనుందని చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: