తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ ఉద్యమకారుడి నుంచి రాజకీయ నేతగా ఎదిగారు. ఇపుడు రాజకీయకోవిదుడుగా మారుతున్నారు. ఈ పరిణామక్రమంలో ఆయన రెండు తెలుగు రాష్ట్రల ప్రజలకు ఇష్టుడైపోతున్నారు. ఉద్యమ కాలంలో ఆయన ఎలా ఉన్నా ఇపుడు మాత్రం ఆంధ్రులకు అండగా ఉండాలనుకోవడం గొప్ప విషయం. సహాయం చేసుకోవాలనుకుంటే ముందు అడిగేది అన్నయ్యనే. అలా అన్నలా కేసీయార్ ఏపీ విషయంలో అడుగులు వేస్తున్నారు.


ఈ రోజు చిత్తూరు జిల్లాలో పర్యటించిన కేసీయార్ అట్నుంచి తమిళనాడు  కంచిలోని అత్తివరదరాజస్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి నలభయ్యేళ్ళకు స్వామి నెలరోజుల పాటు దర్శనం ఇస్తారు. దాంతో ఆధ్యాత్మిక పర్యటనగా కేసీయార్ రావడం జరిగింది. ఆయనకు చిత్తూరుకు చెందిన వైసీపీ నేతలు, మంత్రులు ఘనస్వాగతం పలికారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే రోజా కేసీయార్ వెంటే ఉన్నారు. అలాగే అనేకమంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అయనతో సమవేశమయ్యారు.


రాయ‌లసీమ గురించి ఈ సందర్భంగా తెలుసుకున్న కేసీయార్ తాను ఆ ప్రాత అభివ్రుధ్ధికి సాటి తెలుగు సీఎంగా సహకరిస్తానని చెప్పడం ఆనందకరమైన విషయంగా చూడాలి. నీరు లేక అల్లాడుతున్న రాయలసీమ కోసం గోదావరి జలాలను మళ్ళిస్తామని  చెప్పారు. ఈ విషయంలో ఏపీ సీఎం జగన్ పట్టుదలగా ఉన్నారని, ఆయనతో కలసి రాయలసీమ కరవు కాటకాలు లేకుండా చూస్తామని కేసీయార్ చెప్పారు.


ఇదే సందర్భంలో కేసీయార్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు కలసి మెలసి ఉంటే సమస్యలు ఉండవని, అభివ్రుద్ధి సాధించుకోగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీయారె ఆర్కే రోజా ఇంటికి వెళ్లడం ఈ విశేషం. అక్కడ ఆయన రెండు గంటల పాటు గడపడంతో రోజా ఆనందభరితురాలు అయ్యారు.  తనను కేసీయర్ ఓ కుమార్తెగా  భావించారని ఆమె మీడియాకు చెప్పారు. మొత్తానికి కేసీయార్ ఈ రోజు టూర్ కూడా సంచలనంగానే సాగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: