ఉమా జంప్ అట. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి ఇదే ప్రచారం. బంగీ జంప్ ఐతే చేసేశారు. మరి పొలిటికల్ జంప్ ఎప్పుడు.? విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. టీడీపీ లో ఉండలేక అలాగని సైకిల్ దిగలేక క్వశ్చన్ మార్క్ దగ్గరే విషయాన్ని నానుస్తున్నారట. టిడిపిలో దూకుడుగా ఉండే నేతల్లో బోండా ఉమ ఒకరు.


కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా లేరు. చంద్రబాబుకి టచ్ లోనూ లేరు. దీంతో బోండ ఉమా దారెటు అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. దానికి ఇప్పటి దాకా సమాధానం దొరక్క పోవడంతో బెజవాడ పొలిటికల్ స్క్రీన్ మీద ఉత్కంఠ కొనసాగుతోందట.నిజానికి బోండా ఉమా వైసిపి లో చేరటానికి రెడీ అయ్యారట. అటు వైసీపీ నేతలతో చర్చల పరంపర కూడా ముగిసిందట. విజయవాడ తూర్పు నియోజక వర్గం ఇన్ చార్జి బాధ్యతలు బోండాకి ఇవ్వటానికి వైసిపి అధిష్టానం ఓకే చెప్పిందట.


కానీ అంతలోనే దేవినేని అవినాష్ కూడా సైకిల్ దిగబోతున్నారన్న ప్రచారం మొదలైంది. ఆయనకు కూడా వైసీపీ విజయవాడ తూర్పు బాధ్యతలూ ఇస్తుంది అన్నది ఈ ప్రచారం లో కొసమెరుపు. నేను పార్టీ మారేది లేదు ఇవన్నీ పుకార్లేనని దేవినేని అవినాష్ తేల్చి చెప్పేశారు, కానీ, అవినాష్ కి కూడా విజయవాడ తూర్పు బాధ్యతలూ అన్న లైన్ మాత్రం బోండా ఉమని పునరాలోచనలో పడేసిందట.అలాగని టీడీపీ లోనే కొనసాగుదామంటే అందుకు అనువైన వాతావరణం కూడా లేదని రాజకీయ వర్గాల్లో డిస్కషన్ సాగుతుందట.


ఎందుకంటే బోండా ఉమకి టిడిపి అధిష్టానానికి మధ్య ఫుల్ గ్యాప్ ఇప్పటికే వచ్చేసిందనీ పొలిటికల్ సర్కిల్స్ చెబుతున్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా పర్యటన ముగించి విజయవాడ చేరుకున్న బోండా ఉమ వద్దకి బుద్దా వెంకన్నని పంపిందట పార్టీ అధిష్టానం. పార్టీ మారవద్దని బోండాతో బుద్దా చర్చించారట. అయితే ఈ రాయభారం సీన్ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారట.


బుద్ధ వెంకన్నకి బోండ ఉమా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదట. అదే సమయంలో బుద్ధ వెంకన్నని అధిష్టానం పంపించటమేమిటి బుద్దా చెబితే ఓకే అంటూ బోండ ఉమా సైలెంట్ అయిపోతారా అన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తోందట. దీంతో అన్నీ ప్రశ్నార్థకాలు తప్ప ఎలాంటి స్పష్టత రావడం లేదట. ఈ జంపింగ్ జపాంగ్ ఎపిసోడ్ కి బోండా ఉమ ఇచ్చే క్లారిటీ ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తి కరంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: