త్వరలోనే కేసీఆర్ సమర్పణలో బ్రహ్మాండమైన విడుదల అంటూ తెలుగు రాష్ర్టాల్లో మారు మోగిపోతోందట. ఇంతకీ ఏంటా బ్రహ్మాండమైన విడుదల.? కళా తపస్వీ కె విశ్వనాథ్, కళా పిపాసి కెసీఆర్. ఇద్దరి కాంబినేషన్ సెట్ అయితే.? కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి పాలనా వ్యవహారల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. కె విశ్వనాథ్ గారి సినిమాలు తీయనని ఇప్పటికే చెప్పేశారు. మరి అలాంటిది కె విశ్వనాథ్ కేసీఆర్ కాంబినేషన్ ఏంటి.? పైగా ఇద్దరిదీ అసలు ఏమాత్రం సంబంధం లేని రంగాల గదా.? విషయమేంటంటే పరిపూర్ణమైన ఆధ్యాత్మిక చిత్రాన్ని నిర్మించాలన్న కోరిక కేసీఆర్ కి ఎప్పట్నుంచో ఉందట. ఇప్పటిదాకా తెలుగులో ఎన్నో ఆధ్యాత్మిక చిత్రాలు వచ్చాయి.



కానీ వాటిలో చాలా వరకు ఏదో ఒక కమర్షియల్ అంశాల్ని చూపించి అసలు కథను పక్కనబెట్టారన్నది కేసీఆర్ అభిప్రాయమని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. అందుకే సంపూర్ణమైన ఆధ్యాత్మిక చిత్రాన్ని ప్రజలకు అందించాలన్న భావన కేసీఆర్ కి ఎప్పట్నుంచో ఉందట. కళాతపస్వి ఒక ఆధ్యాత్మిక చిత్రం తీయడానికి అంగీకరిస్తే నిర్మాతగా మారడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారట. ఇదే విషయాన్నీ కె విశ్వనాథ్ ని కలిసిన వేళ చెప్పారట కేసీఆర్. చరిత్రకు సంబంధించిన సినిమాలన్నా ఆధ్యాత్మిక చిత్రాలన్నా  కేసీఆర్ కు అమితాసక్తి.


వాటిని ఇష్టంగా చూస్తారట. అందుకే అలాంటి చిత్రాలకు పన్ను రాయితీతో అండగా నిలుస్తూ ఉంటారు. ఐతే, సినిమాని కేవలం లాభం అన్న కోణంలోనే తీయడం వల్ల అసలు కథనం దెబ్బతింటుంది అన్నది కేసీఆర్ అభిప్రాయమట. కమర్షియాలిటీని పక్కన బెట్టి చరిత్రలో నిలిచిపోయే గొప్ప సినిమాను అందించాలని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకోసం తన అభిమాన దర్శకుడు కళాతపస్విని ఆయన ఎంచుకున్నారట. ఇక కె విశ్వనాథ్ నుంచే గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉందని టి ఆర్ ఎస్ వర్గాలు చెప్తున్నాయట.


కె విశ్వనాథ్ కూడా సై అంటే అత్యంత అరుదైన కాంబినేషన్ లో అద్భుతమైన సినిమా సిద్ధమవుతుందన్నమాట. మరోవైపు ఇక సినిమాలు తీయనని కె విశ్వనాథ్ ఇప్పటికే చెప్పేశారు. ఇప్పుడు కేసీఆర్ స్వయంగా వచ్చి కోరటంతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుంటారా అన్న దానిపై ఫిలిమ్ నగర్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. మరోవైపు కె విశ్వనాథ్ దర్శక పర్యవేక్షణ చెయ్యడానికి అంగీకరించిన చిత్రాన్ని నిర్మించడానికి తాము సిద్ధమని కేసీఆర్ చెప్పారట. దీంతో వీరి కాంబినేషన్ లో త్వరలోనే స్టార్ట్, కెమెరా, యాక్షన్ ఖాయమని అటు టాలీవుడ్ లో ఇటు టీఆర్ ఎస్ లో డిస్కషన్ సాగుతోందట.


మరింత సమాచారం తెలుసుకోండి: