వైఎస్ జగన్ పాదయాత్ర.. దాదాపు 14 నెలలపాటు సాగిన ఓ నాయకుడి సంచలన యాత్ర.. ఆంధ్రప్రదేశ్ లోని 3648 కిలో మీటర్ల మేర సాగిన ఆత్మీయ యాత్ర.. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆయన నిర్వహించిన పాదయాత్ర అధికారంలోకి తెస్తే.. 2019లోనూ అదే సీన్ ఆంధ్ర ప్రదేశ్ లో రిపీట్ అయ్యింది. తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా జగన్ జననాయకుడిగా రూపాంతరం చెందాడు. అధికారం అందుకున్నాడు.


జగన్ పాదయాత్రపై జాతీయస్థాయి జర్నలిస్ట్, ది ప్రింట్ పత్రక ఎడిటర్ శేఖర్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర ద్వారా వైఎస్‌ జగన్‌ చరిత్ర సృష్టించారని శేఖర్‌ గుప్తా అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ ఆశయాలను, వారసత్వాన్ని జగన్‌ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. వైఎస్సార్‌తో తనక ప్రత్యేకమైన అనుబంధం ఉన్నట్లు ఆయన గుర్తు చేశారు. దేశంలో జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలే బలంగా ఉన్నాయని శేఖర్ గుప్తా అభిప్రాయపడ్డారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వం రాష్ట్ర ప్రజలకు ఎంతో అవసరముందన్నారు.


చారిత్రాత్మక ‘ప్రజాసంకల్పయాత్ర’ పాదయాత్రపై రూపొందించిన జయహో పుస్తకం ఆవిష్కరణ శేఖర్ గుప్తా చేతుల మీదుగా జరిగింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌, ది ప్రింట్‌ ఎడిటర్‌ చీఫ్‌ పద్మభూషన్‌ శేఖర్‌ గుప్తా చేతుల మీదుగా సోమవారం ఆవిష్కంచారు. సీనియర్‌ పాత్రికేయులు రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో జయహో పుస్తకం సంకలనం చేశారు. 


ఈ జయహో ఈ పుస్తకాన్ని ప్రముఖ ఎమెస్కో సంస్థ ప్రచురించింది. 14 నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్రలోని వివిధ చారిత్రాత్మక ఘట్టాలను దీనిలో పొందుపరిచారు. 3,648 కి.మీ సుదీర్ఘంగా సాగిన పాదయాత్రను ఫోటోలతో సహా పుస్తకాన్ని రూపకల్పన చేశారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు, శేఖర్‌గుప్తా, రామచంద్రమూర్తి, వైఎస్సార్‌సీపీ నేతలు, సీనియర్‌ పాత్రికేయులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: