పాకిస్తాన్ చాలా అతి చేస్తోంది. తన కొంప ఏదో మునిగిపోయినట్లుగా నానా హైరానా పడుతోంది. ఓవయాక్షన్ చేస్తోంది. అసలు పాక్ తన గురించి తాను ఒక్కసారి అయినా ఆలొచించుకుందా అన్నది పెద్ద డౌట్. అలా కనుక ఆలోచిస్తే పాక్ ఇలాంటి వాటికి తెగించదు. కానీ పాక్ కి ఎందుకో ఇవన్నీ బుర్రకెక్కడంలేదు.


భారత్ మీద పగతో రగిలిపోతోంది. కాశ్మీర్ విషయాన్ని భారత్ శాంతియుతంగా పరిష్కరించుకుంది. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించింది.   ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా పాక్ కి కనీసమాత్రంగా కూడా మద్దతు ఇవ్వలేదు. అమెరికా పెద్దన్న మౌనం వహించారు.   చైనా సైలెంట్ అయింది. రష్యా భారత్ పక్షమే వహించింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అరబ్ దేశాలేవీ కూడా పాక్ కి ఎక్కడా మద్దతు  ఇవ్వకపోవడంతోనైనా  గ్రహించాలి. వీటన్నిటి కంటే కూడ ఉగ్ర సంస్థ తాలీబన్లు కూడా కాశ్మీర్ విషయంలో పాక్ కి అసలు మద్దతు ఇవ్వకపోవడం అతి పెద్ద విశేషం. భారత్, పాక్ ఈ సమస్య పరిష్కరించుకోవాలని తాలిబన్లు చెప్పడం బట్టి చూస్తే పాక్ ఆశలన్నీ అడియాశలుగా మారాయి.


నిజంగా పాక్ ఈ సమయంలో విచక్షణతో వ్యవహరించాలి.  కానీ దెబ్బ తిన్న బెబ్బులిలా పాక్ రెచ్చిపోతోంది. భారత్ అంతు చూస్తానన్నట్లుగా శివాలెత్తుతోంది. తాజాగా అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ రేంజర్లు, భారత్ సైనికులు ఈద్ ముబారక్ సందర్భంగా  స్వీట్లు పంచుకోలేదంటే పాక్ ప్రతీకారం ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. ఇక పాక్ యుధ్ధ సన్నాహాల్లో ఉందని వార్తలు వస్తున్నాయి. పాక్ తన యుధ్ధ విమానాలను లడక్ వైపుగా  తరలిస్తోందని  చెబుతున్నారు. ‘పాక్‌ మూడు సీ-130 రవాణా విమానాల్లో స్కర్దు ఎయిర్‌ బేస్‌కు సామగ్రి చేరవేసింది’’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాక్‌ తన జేఎఫ్‌-17 యుద్ధ విమానాలను కూడా స్కర్దుకు తీసుకొచ్చే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 


దీన్ని బట్టి పాక్ ఉన్మాదిగా మరుతోందని అర్ధమవుతోంది. భారత్ పై యుధ్ధం చేయాలని పాక్ కనుక డిసైడ్ అయితే ఇక ఆ దేశానికి మూడినట్లేనని చెప్పాలి.  భారత్ కూడా ఇదే అవకాశంగా చేసుకుని పాక్ మొత్తం పీచమణడం ఖాయం. పాక్ ని మరిన్ని ముక్కలు చేసి తగిన శాస్తి చేయడానికి భారత్ రంగంలోకి దిగడం ఖాయం. ఎటువంటి కవ్వింపు లేకుండా ముందుగా  యుధ్ధానికి దిగితే పాక్ ప్రపంచానికి ఏం జవాబు చెప్పుకుంటుందో మరి. ఏది ఏమైన పిచ్చి తలకెక్కి పాక్ చేస్తున్న వింత చేష్టలు ఆ దేశాన్ని సుడిగుండంలో నెట్టడం ఖాయమని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: