ఏపీ సీఎం జగన్ , తెలంగాణ సీఎం కేసీఆర్ ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటూ రెండు రాష్ట్రల మధ్య ఉన్న సమస్యలను, ఇటు గోదావరి ...  కృష్ణా జలాల సమస్యలు కావొచ్చు. విభజన సమస్యలు కావొచ్చు . ప్రతి విషయంలోను రెండు రాష్ట్రాల సీఎంలు సహకరించుకుంటూ  ఇరు రాష్ట్రాల అభివృద్ధిని కోరుకుంటున్నారు. అయితే తమిళనాడులోని అత్తివరదర్ దర్శనార్ధం కొరకు కేసీఆర్ వెళుతూ మధ్యలో నగరి ఎమ్మెల్యే రోజా ఆతిధ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ నేను, జగన్ కలిసి రెండు రాష్ట్రాల్లో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తామని చెప్పుకొచ్చారు. గత 60  70 ఏళ్లలో తెలుగు ప్రజలు ఏనాడూ చూడని అద్భుతమైన ఫలితాలు చూస్తారని చెప్పుకొచ్చారు. 


ముఖ్యంగా కృష్ణ  గోదావరి జలాలను ఒడిసిపట్టుకొని సముద్రంలోకి వృధాగా కలిసిపోతున్న 1000 టీఎంసీల నీరును రాయలసీమ జిల్లాకు మళ్లిస్తామని ఇదొక చరిత్రగా మిగిలిపోతుందని కేసీఆర్ చెప్పారు. ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు .. అయినా రెండు రాష్ట్రాల ప్రజల అభివృద్ధికి దీనిని సాధిస్తామని చెప్పారు. ఆ దిశగా ఇప్పటికే నాకు  జగన్ మధ్య చర్చలు జరిగియాని కేసీఆర్ చెప్పారు. 


రాయలసీమ కష్టాలు నాకంటే ఇంకా జగన్ కు బాగా తెలుసనీ .. ఏపీకి జగన్ ఒక పట్టుదల కలిగిన సీఎం అని ఖచ్చితంగా మేమిద్దరం కలిసి రాష్ట్ర ప్రజల అభివృద్ధిలో అద్భుతాలు సృష్టిస్తామని కేసీఆర్ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. జగన్ కు నేను పెద్దన్న లాంటి వాన్ని .. జగన్ కు ఏ సహాయం కావాలన్నా చేస్తానని చెప్పారు. తరువాత రోజా ఇచ్చిన విందును గుర్తు తెచ్చుకుంటూ కేసీఆర్ .. రోజా తనకు కూతురు లాంటిదని మంచి ఆతిధ్యం ఇచ్చిందని చెప్పారు. అయితే ఇప్పటికే కేసీఆర్ తో జగన్ సన్నిహతంగా ఉండటం టీడీపీకి అస్సలు నచ్చడం లేదు. అందుకే కేసీఆర్ కొంత మందికి నచ్చకపోవచ్చు అని కెసిఆర్ తెలివిగా సమాధానం చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: