చంద్రబాబునాయుడు మాటలు గురివింద గింజ సామెతను గుర్తుకు తెస్తోంది. ఐదేళ్ళ అధికారంలో ఉన్నపుడు అసెంబ్లీలో కానీ బయటకానీ జగన్మోహన్ రెడ్డి అండ్ కో విషయంలో ఎలా వ్యవహరించారో మరచిపోయినట్లున్నారు. అందుకే జగన్ అసెంబ్లీలోను బయట తమను అవమానం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. జగన్ అసెంబ్లీలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నట్లు మండిపోయారు. అసెంబ్లీలో మైకులు ఇవ్వకపోతే బయటకొచ్చి మీడియా సమావేశాల్లో మాట్లాడుకోవాల్సొస్తోందంటూ అమాయకంగా చెబుతున్నారు.

 

అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ను చంద్రబాబు అండ్ కో ఎలా అవమానించింది అందరికీ గుర్తుండే ఉంటుంది. మాట్లాడటానికి మైక్ ఇవ్వకపోవటమే కాకుండా ఎప్పుడైనా  మైక్ ఇచ్చినా జగన్ ను వ్యక్తిగతంగా అటాక్ చేసేవారు. తాత, తండ్రి దగ్గర నుండి చాలా నీచంగా మాట్లడేవాళ్ళు.

 

ఇక అసెంబ్లీ బయట కూడా వైసిపి నేతలు ఎంతమందిపై దాడులు జరిగిందో లెక్కేలేదు. వైసిపి నేతలను ఎంఆర్వో కార్యాలయానికి పిలిపించి మరీ అనంతపురంలో హత్య చేసిన విషయాన్ని చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి లాంటి వాళ్ళపై  ఎన్నిసార్లు కేసులు పెట్టి జైళ్ళకు పంపారో లెక్కేలేదు. అవినీతిని, అరాచకాన్ని ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్ళిన చంద్రబాబు ఇపుడు జగన్ పాలనను తప్పు పడుతున్నారు.

 

జగన్ పాలనలో అరాచకాలు పెరిగిపోయాయట. అవినీతి విచ్చలవిడిగా జరిగిపోతోందట. రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి అన్నదే జరగటం లేదట. జగన్ పాలన మొత్తం కూల్చివేతలు, దోపిడిలు, రద్దులతో బిజిగా ఉందట. ఏది ఇదంతా జగన్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే జరిగిపోయిందట.

 

మొత్తానికి జనాలను జగన్ ప్రభుత్వంపై తిరగబడమని చంద్రబాబు చెబుతున్నారు. అంటే ప్రతిపక్షంలో కనీసం రెండు నెలలు కూడా కూర్చోలేకపోతున్న విషయం అర్ధమైపోతోంది. వైసిపి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే కొన్ని ప్రాంతాల్లో గొడవలైన మాట వాస్తవం. కానీ అది వ్యక్తిగత గొడవల స్ధాయిలోనే ఉంది. అంతేకానీ చంద్రబాబు చెబుతున్నట్లు జనాల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదనే చెప్పాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: