ఎన్నికలో టీడీపీ పార్టీ ఓటమి తరువాత చంద్రబాబు ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకొని ఆత్మ పరిశీలన చేసుకోకుండా బాబుగారు .. ఇంకా జగన్ మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఎదో ఒక విషయం మీద విమర్శలు అప్పుడప్పుడు చేయొచ్చు గాని అదే పనిగా విమర్శలు చేస్తే మాత్రం ప్రజల్లో పలచన అయిపోతారు. కానీ బాబుగారు మాత్రం ఇవేమి  ఆలోచించడం లేదు. బాబుగారు మాత్రమే అనుకుంటే లోకేష్ కూడా ట్విట్టర్ లో ప్రతి దానికి హంగామా చేస్తున్నారు. 


జగన్ సర్కార్ ఏర్పడి పట్టుమని రెండు నెలలు కూడా కాలేదు. కానీ ఏపీలో మన ప్రతి పక్ష పార్టీలు కూడా అప్పుడే జగన్ మీది దుమ్మెత్తి పోస్తున్నారు. విమర్శలు చేస్తే గాని మనుగడ ఉండదని వేరు భావిస్తున్నారేమో .. అందుకే పొద్దున్నే లేసిన నుంచి సర్కార్ మీద అర్ధం పర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం 151 సీట్లు సాధించి రికార్డు విజయాన్ని కైవసం చేసుకుంది. టీడీపీ పార్టీకి కేవలం 23 స్థానాలు కట్టబెట్టారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఆ పార్టీ మీద ప్రజలకు ఎంత కసి, కోపం ఉందో .. కానీ టీడీపీ పార్టీకి అవన్నీ పట్టినట్లు లేవు. ఎన్నికల ఘోర పరాజయానికి ఆత్మ పరిశీలన చేసుకోవటం మానేసి ఇంకా మూడు నెలలు కూడా నిండని సర్కార్ మీద ఎదురుదాడి చేస్తే .. మొదటికే మోసం వస్తుందన్న సంగతీ గ్రహించడం లేదు. 


గతంలో జగన్ కూడా ప్రతి పక్షంలో ఉన్నప్పుడు కూడా విమర్శలు చేసే వారు. కానీ ఇలా చంద్రబాబు మాదిరిగా అయిన దానికి ... కాని దానికి అర్ధం పర్ధం లేకుండా విమర్శలు చేయడం చేసే వారు కాదు . జగన్ అధికారంలోకి వచ్చి కనీసం ఒక సంవత్సరం అయినా అయ్యి ఉండి ఉంటే విమర్శలు చేసినా ఒక అర్ధం ఉంటుంది. చివరికి అధికారులు తప్పులు చేసిన దానిని కూడా జగన్ కు అంటగట్టానికి టీడీపీ విశ్వప్రయత్నం చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: