టీడీపీలో తెల్ల ఏనుగులను పక్కన పెట్టాలని మరోసారి అధిష్టానానికి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచించారు. విజయవాడలోన ఏవన్‌ సమావేశ మందిరంలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.  పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేథ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమీక్ష సమావేశానికి హాజరైన బుచ్చయ్య చౌదరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఈ సమావే ఉద్దేశ్యం ఇటీవల జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షించడమే.



దాంతో పాటుగా ఎన్నికల అనంతరం టీడీపీ కార్యకర్తలు, ప్రజలపై దాడి, ఆర్టికల్‌ 370 రద్దు- కాశ్మీర్‌ సమస్య తదితర అంశాలపై విస్తృత చర్చ జరిపేందుకు సమావేశమయ్యారు. ఇందులో భాగంగా సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పార్టీలో అంతర్గతంగా చోటు చోటుచేసుకున్న పరిణామాలను తీవ్ర స్థాయిలో ఆక్షేపించారు. ఒక దశలో టీడీఎల్పీ ఉప నేత పదవికి రాజీనామా చేస్తానని పరోక్షంగా అధిష్ట్రానానికి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.ఐదారు సార్లు ఓడినవారికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు..? అని ఈ సందర్భంగా సొంత పార్టీనే ప్రశ్నించారు. సీనియర్లు తప్పుకుని యువతకు అవకాశమివ్వాలని బుచ్చయ్య పిలుపునిచ్చారు.




ఈ  సమావేశంలో పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తదితర అంశాలను ప్రధానంగా చర్చించేందుకు ఏర్పాటు చేసిన  సమావేశం సందర్భంగా బుచ్చయ్య చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాను రాజీనామా చేసిన తర్వాత ఆ పదవి బీసీ నేతకు ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతానని చెప్పడం టీడీపీ అధిష్టానం అవలంభించిన వైఫల్యాలను ఎత్తిచూపుతున్నట్టుగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యల వెనుక అధీష్టానం దేనికి సంకేతాలు ఇవ్వబోతుందన్న అంశంపై తెలుగు తమ్ముళ్లు మల్లగుల్లాలు పడుతున్నారు. మరో పార్టీ క్లిష్టమైన పరిస్థితులలో తరుణంలో సీనియర్ నాయకుడు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం తగదంటున్నారు. పార్టీ కోసం పని చేసే కార్యకర్తల మనోభావాలకు విఘాతం కలుగుతుందంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: