Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Aug 24, 2019 | Last Updated 9:34 pm IST

Menu &Sections

Search

కశ్మీర్ విషయంలో వెనకడుగేసిన ట్రంప్..

కశ్మీర్ విషయంలో వెనకడుగేసిన ట్రంప్..
కశ్మీర్ విషయంలో వెనకడుగేసిన ట్రంప్..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కశ్మీర్‌ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌   ట్రంప్‌ నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం. ఇకపై కశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వం కోసం తాను చేసిన ఆఫర్‌ ఇకపై ఎప్పుడూ చర్చకు రాదని ట్రంప్‌ స్పష్టం చేసినట్లు అమెరికాకు భారత రాయబారి హర్షవర్ధన్‌ శ్రింగ్లా తెలిపారు. కశ్మీర్‌ వ్యవహారంలో మధ్యవర్తిత్వం చేయకూడదనేది అమెరికా దశాబ్దాల నాటి విధానం. అయితే ఈ సమస్యను భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మాత్రం రెండు దేశాలను ప్రోత్సహిస్తూ వస్తోంది’ అని హర్షవర్ధన్‌ శ్రింగ్లా ఫాక్స్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. మరో పక్క  భారత్‌పై పాక్‌ చేయబోయే ఫిర్యాదు స్వీకరించడానికి ఐరాస భద్రతా మండలి సిద్ధంగా లేదని ఘాటుగా స్పష్టం చేశారు.



కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వానికి తాము సిద్ధమేనంటూ ఆ మధ్య  ట్రంప్‌ చేసిన ప్రకటన భారత్‌లో తీవ్ర వివాదానికి దారితీసింది. అమెరికా పర్యటనకు వచ్చిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో జులై 22న ట్రంప్‌ ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం చేయాలని భారత ప్రధాని తనను కోరినట్లు ఆ సమయంలో ట్రంప్‌ చెప్పారు.తాజా పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం తమకు అండగా నిలిచే అవకాశం లేదని పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ పరోక్షంగా అంగీకరించారు. అలాగే అక్కడి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన పాక్‌ ప్రజలపై అసహనం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వం కోసం తాను చేసిన ప్రతిపాదన భారత్‌, పాకిస్థాన్‌ల అంగీకారంపై ఆధారపడి ఉందని ట్రంప్‌ గతంలో స్పష్టం చేశారు. రెండు దేశాలు ఒప్పుకుంటే మధ్యవర్తిత్వం వహించేందుకు తాను సిద్ధమే అన్నారు. అయితే అందుకు భారత్‌ నిరాకరించడంతో మధ్యవర్తిత్వం ఆఫర్‌ ఇంకెప్పుడూ చర్చకు రాదని ఆయన స్పష్టంగా చెప్పారు.



ట్రంప్‌ వ్యాఖ్యలు భారత్‌లో వివాదానికి  తెరలేపాయి. దీంతో స్పందించిన భారత ప్రభుత్వం.. అగ్రరాజ్య అధ్యక్షుడి వ్యాఖ్యలను కొట్టిపారేసింది. మోదీ, ట్రంప్‌ మధ్య కశ్మీర్‌ ప్రస్తావనే రాలేదని తేల్చిచెప్పింది.  ఇది జరిగిన కొద్ది రోజులకు ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘కశ్మీర్‌ సమస్య భారత్‌, పాక్‌ ద్వైపాకిక్ష అంశమే. అయితే ఒకవేళ ఆ సమస్య పరిష్కారం కోసం మా సాయం కోరితే మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని అన్నారు. దీనికి భారత్‌ స్పందిస్తూ.. ‘కశ్మీర్‌పై ఎలాంటి చర్చలైనా అవి కేవలం పాకిస్థాన్‌తో మాత్రమే.. అది కూడా ద్వైపాక్షికంగానే’ అని స్పష్టం చేసింది. దీంతో ఈ విషయంలో ట్రంప్‌ వెనక్కి తగ్గారు. ఇటీవల జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ భారత సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై అమెరికా స్పందిస్తూ.. అది పూర్తిగా ద్వైపాక్షిక అంశమేనని పేర్కొంది.




అమెరికా పర్యటనకు వచ్చిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో జులై 22న ట్రంప్‌ ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం చేయాలని భారత ప్రధాని తనను కోరినట్లు ఆ సమయంలో ట్రంప్‌ చెప్పారు.

అమెరికా పర్యటనకు వచ్చిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో జులై 22న ట్రంప్‌ ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం చేయాలని భారత ప్రధాని తనను కోరినట్లు ఆ సమయంలో ట్రంప్‌ చెప్పారు.
Trump backs down on Kashmir.
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.