శ్రీరాముడు త్రేతాయుగానికి చెందిన వ్యక్తి.  శ్రీరాముడిని భగవంతుడిగా ఆరాధిస్తుంటాము.  త్రేతాయుగం తరువాత ద్వాపర యుగం, ఇప్పుడు కలియుగం నడుస్తోంది.  శ్రీరాముడు అయోధ్యలో పుట్టారని, అయోధ్యను పరిపాలించారని మన పురాణాలు చెప్తున్నాయి.  అయోధ్యలో రామజన్మభూమి సంబంధించిన వివాదం గత కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్నది.  కోర్టులో ఉన్న ఈ కేసు ఇప్పటి వరకు తేలలేదు. హిందూ.. ముస్లింల మధ్య మధ్యవర్తిత్వం వహించే కమిటీ కూడా ఎలాంటి సలహాలు ఇవ్వలేకపోయింది. 

దీంతో సుప్రీమ్ కోర్ట్ డైరెక్ట్ గా రంగంలోకి దిగి రోజువారీ విచారణలు చేపట్టేందుకు సిద్ధం అయ్యింది.  ఈనెల 6 వ తేదీ నుంచి రోజువారీ విచారణలు చేస్తున్నది.  ఇరు వర్గాల వారిని అనేక ప్రశ్నలు వేస్తోంది సుప్రీం కోర్టు.  అయితే, ఇటీవలే సుప్రీమ్ కోర్ట్ రామ జన్మభూమి తరపున వాదిస్తున్న లాయర్ పరాశరణ్ ను వివిధ ప్రశ్నలు అడిగింది.  అందులో ఓ ప్రశ్న.. శ్రీరాముడి వారసులు ఇప్పుడెవరైనా ఉన్నారా..? అని  


ఈ ప్రశ్నకు పరాశరణ్ కు ఏం జవాబు చెప్పాలో అర్ధం కాలేదు.  తెలుసుకునే ప్రయత్నం చేస్తానని అన్నాడు.  సుప్రీం ఈ ప్రశ్న అడిగిన కొన్ని రోజులకు తాము శ్రీరాముని వారసులమని, రాముడి కుమారుడైన కుశుడి వంశానికి చెందిన వారమని జైపూర్ రాజవంశానికి చెందిన దియాకుమారి ప్రకటించింది. ఈ ప్రకటన చేసిన మరుసటి రోజునే మరో రాజవంశం మరో ప్రకటన చేసింది.  


తాము లవుడు వంశానికి చెందిన వారమని, లవుడి పూర్వికులు గుజరాత్ లో ఉండేవారని, ఆ తరువాత మేవర్ కు వచ్చారని, మేవర్ లో శిశోడియా రాజ వంశాన్ని ఏర్పాటు చేశారని, ఆ తరువాత ఉదయ్ పూర్ వచ్చి అక్కడ ఉదయ్ పూర్ రాజవంశాన్ని స్థాపించారని  ఉదయ్ పూర్ రాజవంశానికి చెందిన మహేంద్ర సింగ్ పేర్కొన్నారు.  దీనికి సంబంధించిన సాక్ష్యాలు తమ దగ్గర ఉన్నాయని, అవసరమైతే వీటిని కోర్టుకు ఇస్తామని అందజేస్తామని అయన అన్నారు.  మరి దీనిపై సుప్రీమ్ కోర్ట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: