నల్లమల అటవీ ప్రాంతంలో అలజడి మొదలైంది. అడవి బిడ్డల మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయింది. పచ్చని అడవిలో ఇపుడు భూతం గిరిజనులకు నిద్రలేకుండా చేస్తుంది. ఆ భూతం ఒక్కసారి ఎంటరైతే అడవితో పాటు పక్కనే ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు ముప్పు ఉంది. నల్లమలలో ఒక్కసారిగా భూతం ఎంటరైతే అడవి బిడ్డల పరిస్థితి ఏంటి.? వారు ఎటు వెళతారు.?  ఎక్కడికెళతారు.? ఇన్నాళ్లు అడవినే నమ్ముకుని జీవిస్తున్న వారు ఏం చెయ్యాలి.? ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే ఆ భూతాన్ని తాము రానిచ్చేది లేదు అని గిరిజనులు చెబుతున్నారు. 



ఈ యురేనియం వేట అనేది ఇప్పుడు ప్రారంభమైంది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా నల్లమల్ల టార్గెట్ గా అనేక పరీక్షలు అక్కడ నిర్వహించారు. నల్లమలలో సీక్రెట్ గా కూడా కొన్ని పరీక్షలు నిర్వహించారు. కొన్ని అక్కడ చుట్టు పక్కల గ్రామస్థులకు కనీస సమాచారం ఇవ్వకుండా కూడా గతంలో పరీక్షలు నిర్వహించారు. అక్కడ దాదాపు మూడు వందల ఫీట్లకు పైగా ఒక బోర్ ఉంది. అది ఏ రైతు వేసుకున్న బోరో లేదంటే నీళ్ల కోసం వేసిన బోరునో కాదు. మట్టి పరీక్షలు చెయ్యటానికి మట్టిలో యురేనియం ఎంత వరకు ఉందో తెలుసుకోవటానికి వేసిన బోరు అది. అక్కడ బోరు వేసిన తర్వాత వాళ్లు ప్రతి ఐదు ఫీట్లకు ఒకసారి ఆ మట్టిని సేకరించారు. దాదాపు మూడు వందల ఫీట్లకు మించి ఆ బోరు ఉంటుందని చెబుతున్నారు. 



మూడొందల ఫీట్లకు మించి బోరులో ప్రతి ఐదు ఫీట్లకు ఒక శాంపుల్స్ ని సేకరించారు. శాంపుల్స్ ను సపరేట్ పాకిట్లో తయారు చేసుకున్నారు. మొదట్లో తెలియని గ్రామస్తులు ఇదేదో బోరు వేసుకునే ప్రక్రియ అనుకొని వదిలేశారు. కానీ, విషయం తెలిసిన తర్వాత తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన తరువాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి డెవలప్ మెంట్ జరగలేదు కానీ, ఇప్పుడు లేటెస్ట్ గా డెవలప్ మెంట్ జరగడం తోటి అటు పర్యావరణ శాఖ పర్మిషన్స్ ఇవ్వడంతో గ్రామస్థులు ఉలిక్కి పడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పరీక్షలు నిర్వహించకుండా చూసుకుంటామని హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: