ఏపిలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే.  175 సీట్లకు కేవలం 23 సీట్లు మాత్రమే గెల్చుకుంది.  అయితే గత టీడీపీ పాలన చేసిన అన్యాయ పాలనే తమ విజయానికి నాంది అంటూ వైసీపీ నేతలు అంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఏపి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగుతున్నారు.  ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీని ఎండగట్టిన విషయం తెలిసిందే.  అయితే టీడీపీ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీ నేతల్లో పూర్తిగా అసహనం నెలకొంది. 

ఈ నేపథ్యంలో పలువురు సీనియర్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పుడు సొంత పార్టీ నేతలపైనే విరుచుకుపుడుతున్నారు. ఆయన కొందరి నేతలను తెల్ల ఏనుగులతో పోల్చారు.   ఈ నేపథ్యంలో బుచ్చయ్య చౌదరికి పార్టీ అధిష్టానంపై చాలా అసంతృప్తి ఉంది. గతంలోనూ ఆయనకు మంత్రి పదవి దక్కనప్పుడు చంద్రబాబుపైనే కామెంట్స్ చేశారు. ఐదారు సార్లు ఓడినవారికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు..? అని ఈ సందర్భంగా సొంత పార్టీనే ప్రశ్నించారు. సీనియర్లు తప్పుకుని యువతకు అవకాశమివ్వాలని బుచ్చయ్య పిలుపునిచ్చారు.అంతే కాదు ఇప్పటికే తాను ఆరు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించినట్టుగా ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో  తాను పోటీకి దూరంగా ఉంటానని ఆయన ప్రకటించారు. 

సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు సర్కార్ అమలు చేసినా కూడ ఓటమి పాలు కావడంపై కూడ ఆయన స్పందించారు. తమ పార్టీలో కొంతమంది పై పై మెరుగులపై తిరిగేవారు ఉన్నారని..సొంత లాభాల వైపే వారి దృష్టి ఉండటం..పెద్ద నాయకుల నుంచి మండలస్థాయి నేతలు  సక్రమంగా వ్యవహరించని కారణంగానే  ఓటమి పాలు కావాల్సి వచ్చిందని  గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా అధినేత పార్టీ పదవుల నియామాకాల్లో పారదర్శకతను పాటించాల్సిన అవసరం ఉందని బుచ్చయ్యచౌదరి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: