ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు పార్టీ నేతలతో విసృత చర్చల్లో మునిగిపోయారు.  ఐదేళ్ల పాలనలో తాను ఎన్నో చేసినప్పటికీ ఎందుకు ఓడిపోయారన్న విషయంపై ప్రక్షాలన చేసుకుంటున్నారు.  అభివృద్ది, సంక్షేమ పథకాలు తాను కూడా అమలు పరిచాయని..కాకపోతే అవి సరైన పద్దతిలో అమలు అయ్యాయా..లేక కింది స్థాయి నేతలు ఏదైనా పొరపాటు చేశారా అన్న విషయంపై తన పార్టీ నేతలతో చర్చిస్తున్నారు.  


ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సైతం చంద్రబాబు నాయుడు పెద్దగా స్వరం పెంచకుండా కొన్ని విషయాలపైనే ప్రశ్నంలు సంధించారు.  అయితే వాటికి అధికార పార్టీ చెప్పిన సమాధానాలకు తన పార్టీ నేతలు సైతం ప్రతిఘటించలేక పోయారు.  తాజాగా చంద్రబాబు నాయుడి కుడి చేతికి స్వల్ప గాయమైంది. ఈ నేపథ్యలో, విజయవాడలో జరుగుతున్న టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి చేతికి కట్టుతోనే ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యక్తలతో మాట్లాడుతూ.. టీడీపీ పరిపాలనలో ప్రజలకు చేకూరి లబ్ది గురించి ప్రజలకు తెలియాల్సి ఉందని..లేని పోని అపోహలో ఇతర పార్టీలు కల్పించడం వల్లే ప్రజలకు తమను తిరస్కరించారని ఇప్పటికైనా ప్రజలకు నిజాలు తెలియజేయాల్సిన బాధ్యత పై స్థాయి నుంచి కింది స్థాయి నేతలకు ఉందని అన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, 150 మంది సభ్యులు ఉన్నామంటూ అధికార పార్టీ అసెంబ్లీలో బెదిరిస్తోందని మండిపడ్డారు. ఒక రాష్ట్రాన్ని పాలించే నాయకులు ప్రతిపక్ష నేతలతో అనాల్సిన మాటలు కావని..తాము లేస్తే ఏ ఒక్కరూ మిగలరని హెచ్చరించారు. సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని చెప్పడానికి కూడా మైక్ ఇవ్వడం లేదని చెప్పారు.  అంతే కాదు  ఇసుకపై తప్పుడు ప్రచారం ఇప్పుడు ఇసుక కొరతను సృష్టించి, ఇసుక ధరను విపరీతంగా పెంచేసిందని అన్నారు. సిమెంట్ కన్నా ఇసుక ధరే ఎక్కువైందని అన్నారు. గ్రామ వాలంటీర్ల పేర్లతో ప్రజాధనాన్ని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: