ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ అక్రమ కట్టడాలపై దృష్టి కేంద్రీకరించిన విషయం తెలిసిందే.  అమరావతి లో గొప్ప గొప్ప నిర్మాణాలు అంటూ గత ప్రభుత్వం నిర్మించిన కట్టడాలు రూల్స్ కి విరుద్దంగా..పర్యావరణానికి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమరావతిలో అక్రమ కట్టడాల నిర్మాణం కూల్చి వేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా నెల్లూరు జిల్లాలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. 

అక్కడి మున్సిపల్ అధికారులు టీడీపీ నేతల ఇళ్లు కూల్చివేశారు. అయితే ఆ ఇంటి నిర్మాణాలు పారదర్శకత లేదని చెబుతున్న అధికారులు భారీ బందోబస్సు మధ్య ఉదయాన్నే కూల్చివేత చేపట్టారు. దాంతో టీడీపీ నేతలు అగ్గిలం మీద గుగ్గిలం అవుతున్నారు. వైసీపీ కక్ష సాధింపుతోనే తమ ఆస్తులను టార్గెట్ చేసుకొని కూల్చివేస్తున్నారని ఆరోపిస్తున్నారు.జనార్థన్ కాలనీలో ఇళ్ల కూల్చివేతలను అడ్డుకునేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నించారు.  అన్యాయంగా టీడీపీ నేతల ఇళ్లు టార్గెట్ చేసుకొని కూల్చివేయడం ఎంత వరకు న్యాయం అంటూ పెద్ద గొడవ చేశారు. దీంతో ఆయనను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మీసం మేలేస్తూ..ఇలా మిడిసి పడే పాలన ఎంత కాలం ఉండదని..రో రెండేళ్లలో తాము అధికారంలోకి వస్తామని అధికారులను హెచ్చరించారు. ఇక మున్సిపల్ అధికారులు అధికార పార్టీ అండతో రెచ్చిపోతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కాగా, మూడు రోజుల క్రితమే అక్రమ నిర్మాణాలు కూల్చేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే వారిని ఇళ్ల యజమానులు అడ్డుకోవడంతో వెనుదిరిగారు. ఈ రోజు తెల్లవారు జామున కూల్చివేతలు ప్రారంభించారు. మరోవైపు తాము అన్ని ధృపత్రాలు సమర్పించామని..సరైన సరైన పత్రాలతోనే ఇళ్ల నిర్మాణం చేపట్టామని చెబుతున్నారు. కక్ష సాధింపులో భాగంగానే తమ ఇళ్లు కూల్చివేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: