టీడీపీ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఆ పార్టీలోని సీనియర్ నేతలు చంద్రబాబు మీద అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత అయిన బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. పార్టీల్లో బుచ్చయ్య కు సరైనా ప్రాధాన్యత ఇవ్వలేదేమో .. లేక నిజంగా చంద్రబాబు నిర్ణయాలు బుచ్చయ్య చౌదరికి నచ్చలేదమో తన అసంతృప్తిని బయట పెట్టారు. బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ కొన్ని కొన్ని సార్లు చంద్రబాబు నిర్ణయాలు తనకు ఆశ్చర్యం కలిగిస్తాయని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎందుకు ఐదారు సార్లు ఓడిపోయిన వారికీ అధిక ప్రాధాన్యత ఇస్తారని .. ఇలాంటి వాళ్ళు పార్టీకి బరువు తప్పితే మరొక ఉపయోగం లేదని కుండ బద్దలు కొట్టారు. ఇలాంటి వారిని దూరంగా పెట్టాలని బుచ్చయ్య చౌదరి సూచించాడు. 


ఇంకా మాట్లాడుతూ .. నేను టీడీఎల్పీ ఉప నేత పదవికి రాజీనామా చేస్తానని ఆ పదవి ఇంకెవరికైనా బీసీలకు కేటాయించాలని బుచ్చయ్య వెల్లడించారు. నిజానికి చంద్రబాబు పార్టీ కోసం కష్టపడే వారికీ సరైనా గుర్తింపు ఇవ్వడని ఆన్ ది రికార్డు నేతలే చెప్పడం గమనార్హం. అందుకే కాబోలు నేతలు సరిగా పని చేయక పోవటం చేత 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. 


ఒకే ఒక ఎన్నికలు టీడీపీ పార్టీని మట్టి కరిపించాయంటే అతిశయెక్తి కాదు. ఆపార్టీ పరిస్థితి గత 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా ఘోరంగా క్షేత్ర స్థాయిలో దెబ్బతినిందంటే అతిశయెక్తి కాదని చెప్పాలి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అధినేత చంద్రబాబుతో పాటు ఆపార్టీ కార్యకర్తలు కూడా పెద్ద షాక్ కు గురయ్యారు. నిజానికి టీడీపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను ఆ పార్టీ అధినేత పసిగట్టలేకపోయారు. చేసిన తప్పులను పదే పదే చేసుకుంటూ పోయారు. అందుకే కాబోలు ఇప్పుడు బుచ్చయ్య చౌదరి లాంటి వారు చంద్రబాబును హెచ్చరిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: