గంటా శ్రీనివాస్ కొన్ని రోజుల నుంచి సైలెంట్ గా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ మీద విమర్శలతో రెచ్చిపోయేవారు. కానీ ఇప్పుడెందుకో గంటా మోగడం లేదు. అసెంబ్లీలో కూడా గంటా నోరు తెరిచి మాట్లాడటం లేదు. అధికారంలో ఉన్న వైసీపీ ఎక్కడ తన మీద పగబట్టి కేసుల్లో ఇరికిస్తుందేమో నని గంటా భయపడుతున్నంటున్నారు. అందుకే ఎక్కడ సడి చప్పుడు లేకుండా తన పని తాను చూసుకుంటున్నాడు. 


గంటా శ్రీనివాస్ ప్రతి సారి ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి మారేది .. ఆ పార్టీలో పదవులు అనుభవించడం గంటా శ్రీనివాస్ కు అలవాటు. అధికార పార్టీలో లేకపోతే గంటా రాజకీయాలు చేయలేనతంగా బలహీనంగా మారిపోతారు. గంటా టీడీపీ నుంచి ప్రజారాజ్యం లోకి చేరి తరువాత కాంగ్రెస్ పార్టీలోకి చేరి క్యాబినెట్ మంత్రి పదవిని కూడా అనుభవించారు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయే లోపలా .. వెంటనే గంటా 2014 లో టీడీపీలో చేరి మళ్ళీ మంత్రి పదవిని దక్కించుకొని పదవులను అనుభవించారు. అయితే 2019 ఎన్నికల్లో పార్టీ మారకుండా టీడీపీ తరుపున పోటీ చేసినా గెలిచారు. విచిత్రం ఏంటంటే గంటా నియోజక వర్గం మారినా .. జగన్ వేవ్ ను తట్టుకొని గెలిచాడు. 


అయితే గంటా .. ఎన్నికల ముందు జగన్ దగ్గరికి చేరి ఉంటే, ఇప్పుడు మంచి పదవిని పొందే వాడేమో ! మళ్ళీ అధికార పార్టీలో చక్రం తిప్పే వాడు. కానీ ఇప్పుడు ప్రతి పక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అధికారం లేనిదే గంటా కు నిద్ర పట్టదు కాబట్టి .. తాను బీజేపీలోకి చేరబోతున్నాడని, గంటా ఉత్తరాంధ్రలో బలమైన నేత కాబట్టి, పైగా బలమైన సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో బీజేపీ గంటా మీద కన్నేసింది. పైగా టీడీపీ విస్తృతస్థాయి సమావేశానికి గంటా డుమ్మా కొట్టడంతో ఇప్పుడు మళ్ళీ గంటా మీద అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. 







మరింత సమాచారం తెలుసుకోండి: