ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ కష్టపడి, ప్రజల మద్ధతు కూడగట్టుకుని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఊహించని విధంగా 151 స్థానాలు దక్కించుకుని మొదటిసారి సీఎం అయ్యారు. ఇక సీఎం అయిన దగ్గర నుంచి పాలన వ్యవహారాలని చూసుకుంటున్న జగన్ అవినీతి లేని పాలనే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే అనేక సంచలన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. గత ప్రభుత్వం అవినీతిని బయటపెట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్న జగన్ రాష్ట్ర అభివృద్ధి కోసం సరికొత్త నిర్ణయాలు తీసుకున్నారు.


అయితే జగన్ తీసుకున్న నిర్ణయాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు పూర్తిగా విఫలమయ్యారని తెలుస్తోంది. అందుకే జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకిత వచ్చింది. ఇక కూడా జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో కొన్ని కొత్త బిల్లులని కూడా తీసుకొచ్చింది. బీసీలకి 50 శాతం రిజర్వేషన్, స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు, ఎస్సీ, ఎస్టీ ఇలా 19 బిల్లులకి ప్రభుత్వం ఆమోదించింది. ఈ బిల్లులు ఎందుకు తీసుకొచ్చామనే విషయాన్ని కూడా మంత్రులు ప్రజలకి వివరించలేకపోయారని అంటున్నారు.


అటు మంత్రివర్గంలో ఒకరు ఇద్దరు తప్ప ప్రతిపక్షాలు చేసే విమర్శలని సమర్ధవంతంగా తిప్పికొట్టలేదనే భావన కూడా ఉంది. ఒక‌రిద్ద‌రు మంత్రులు మాట్లాడుతున్నా మిగిలిన వారు బుగ్గ‌న బెల్లం పెట్టుకున్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉండ‌నే ఉన్నాయి. ఇక బొత్స లాంటి సీనియ‌ర్లు మాట్లాడుతున్న మాట‌లు కూడా ప్ర‌భుత్వానికే ఒక్కోసారి ఇబ్బందిగా మారాయి.


ఇక గోదావరి వరదల్లో ముంపుకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడం లో కూడా మంత్రులు వెనుకబడి ఉన్నారని, దీనిపై జగన్ కూడా మంత్రులకి క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది.  మొత్తం మీద పాలన విషయంలో కానీ తీసుకునే నిర్ణయాలు విషయంలో కానీ మంత్రులు జగన్ స్పీడుని అందుకోలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరి వీటిని అధిగిమించి మంత్రులు పాలన విషయంలో ఎలా దూసుకెళతారో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: