తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్టుపై పవన్ కళ్యాణ్ స్పందించారు. అయన మాట్లడుతూ నిన్న రాజోలు నియోజక వర్గంలో మలికిపురంలో జరిగిన ఓ చిన్నపాటి సంఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. జనసేన ఎమ్మెల్యే అయిన రాపాక వర ప్రసాద్ గారి పైన నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీచేశారు.


"అది ఒక చిన్న సంఘటన అది ప్రజలు రాపాకని మద్దతు అడిగితే ఆయన వెళ్లారు.ఒక వ్యక్తికి ఆరోగ్య పరమైన ఇబ్బందులు ఉంటే ఆయనను విడిచిపెట్టమని చెప్పడానికి వెళ్లాల్సి వచ్చిందని తనకు పార్టీ నాయకులందరూ చెప్తే తెలిసింది అని పవన్ కల్యణ్ తెలియజేశారు. అధికార యంత్రాగ నుంచి అని వార్తలను తాను కనుక్కుంటున్నా అని మరియు తనకి వచ్చిన వార్తల్లోని వాటిని సమీక్షిస్తున్నాను అని అన్నారు. తాను తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జిల్లా ముఖ్య నాయకులందరికీ మరియు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులలో కొద్దిమందికి తెలియజేశాను అని ఆయన వ్యక్తం చేశారు.


ఒక చిన్నపాటి సంఘటనని, స్టేషన్ బెయిల్ తో పోయే విషయాన్ని ఆఖరికి  ఈ రోజున ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ గారి మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసారు.అదే సమయానికి నిన్న నెల్లూరు జిల్లాకి చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే ఒక జర్నలిస్టుపై దాడికి పాల్పడి కిడ్నాప్ చెయ్యడానికి ప్రయత్నం చేసాడు. ఆ అంశాన్ని మాత్రం ఎవ్వరూ పరిగణించలేదు మరియు ఆయనపై కేసులు వేయలేదు. ఆయన మీద ఎదో రాయాలిగా అని నామమాత్రంగా రాసి ఆయనను వదిలేశారు.ఇక్కడేమో ఎవరో చిన్నపాటి వ్యక్తికి అనారోగ్యం బాగోలేదు అని కొద్ది జాగ్రత్తతో ఆహాస్పిటల్ కు తీసుకెళ్ళండి అని మాట్లాడితే దానికి మాట మాటా వచ్చి అది పరిస్థితులు చేజారిపోతుంది.


నా విన్నపం ఒక్కటే, అధికార యంత్రాంగానికి అది ప్రభుత్వనికి ఈ విషయాన్ని పెద్దది చేయకుండా దీన్ని ఇక్కడితో సామరస్యంగా పరిష్కరించాలి. అలాగే జనసేన కార్యకర్తలు, నాయకులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా సంయమనం పాటించండి అని కోరారు. ఒకేవేళ నిజంగా పరిస్థితి చెయ్యిదాటి పోయి, ప్రభుత్వం ఏక పక్షంగా వ్యవహరిస్తే తాను రాజోలు వచ్చి రంగంలోకి దిగుతాను అని ఆయన ఘాటుగా స్పందించారు".

మరింత సమాచారం తెలుసుకోండి: