జగన్ కి ఏమీ తెలియదు. అనుభవం లేదు, ఆయన పాలన చేతకాదు, తెల్లారిలేస్తే  చంద్రబాబు జగన్ గురించి అనే మాటలు ఇవే. అయితే యువకుడుగా ఉన్నపుడే ముఖ్యమంత్రి అయిన జగన్ సీఎం హోదాలో ఏం చేయాలో అదే చేస్తున్నారు. పధ్ధతి ప్రకారం నడచుకుంటున్నారు. ఎవరికి ఎక్కడ ఏ రకమైన గౌరవం ఇవ్వాలో ఇస్తూ పోతున్నారు.


ఇపుడు ఏపీలో ఓ ముఖ్యమైన ఘట్టానికి జగన్ తెర తీస్తున్నారు. ఏపీలో రైతు భరోసా కార్యక్రమం జగన్ కి ఇష్టమైన ప్రొగ్రాం. దాన్ని ఈ ఏడాది అక్టోబర్లో  ప్రారంభిస్తున్నారు. ఏపీలోలోని మొత్తం కౌలు రైతులతో పాటు అందరికి వర్తించేలా  ఈ కార్యక్రమాన్నికి రూపకల్పన చేశారు. దీన్ని ఘనంగా రైతుల ముందు తీసుకువెళ్ళాలన్నది జగన్ ఆలోచన. దాని కోసం ఆయన దేశ ప్రధాని నరేంద్ర మోడీని పిలవదలచుకున్నారు. మోడీ చేతుల మీదుగా ఏపీలో రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్నది జగన్ ఉద్దేశ్యంగా ఉంది. 


ఆలా జరిగితే ఏపీలో చేపట్టిన రైతు భరోసా కార్యక్రమం  దేశం మొత్తానికి తెలుస్తుందని జగన్ అంచనా వేస్తున్నారు.  ఈ మధ్య ఢిల్లీకి  వెళ్ళినపుడు ప్రధాన్ని మోడీని కలసి ఈ మేరకు జగన్ ఆహ్వానించారట. ఈ రోజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ ఈ సంగతి చెప్పుకొచ్చారు. ప్రధాని చేతుల మీదుగా జరిగే రైతు భరోసా కార్యక్రమం గొప్పగా  ఉండాలని కూడా సూచించారు. ఇదిలా ఉండగా మోడీకి, జగన్ కి ఫిట్టింగ్ పెట్టి పండుగ చేసుకుందామనుకుంటున్న టీడీపీకి ఈ ఇద్దరినీ ఒకే చోట చూడడం అంటే కష్టమేనని చెప్పాలి.


చంద్రబాబుకైతే చాలా ఇబ్బందిగా ఉంటుందనుకోవాలి.  అయిదేళ్ళ టీడీపీ పాలనలో ఏ ఒక్క కార్యక్రమానికి ప్రధాని మోడీని పిలవలేదు. అమరావతి రాజధానికి కేంద్రం నిధులు ఇవ్వాలి కాబట్టి పిలిచారు తప్ప ఏపీ సర్కార్  తరఫున చేపట్టిన వాటిని బాబు ఏ రోజు మోడీ పేరు ఎత్తలేదు. ఇంకా చెప్పాలంటే కేంద్ర పధకాలకు తన పార్టీ లేబిల్ తగిలించి మైలేజ్ కొట్టేశారు. మరిపుడు జగన్ కి పాలన తెలియదు అనుకోగలమా. ఆయన పాలనాదక్షుడు కాదు అనగలమా.


మరింత సమాచారం తెలుసుకోండి: