జగన్ అధికారంలోకి వచ్చి వచ్చేనెలకు వంద రోజులు పూర్తి అవుతుంది. వంద రోజుల తరువాత జగన్ సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.  ఇప్పటివరకూ సీఎం గా అమరావతికే పరిమిత‌మైన జగన్ ఇకపై మళ్ళీ జనంలోకి రానున్నారు. తాను చేపట్టిన పధకల విషయంలో పూర్తి సంత్రుప్తిగా ఉన్న జగన్ కి ఫీడ్ బ్యాక్ రావాల్సిన చోట నుంచి వస్తోంది.


అయితే తాను ఎవరి కోసం సంక్షేమ కార్యక్రమాలు పెట్టానో ఆ ప్రజల వద్దకే వెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ కోసం ఆయన జిల్లా పర్యటనలకు  రెడీ అవుతున్నారు. ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు కానీ సెప్టెంబర్ నుంచి జగన్ జనంలో ఉంటారని అంటున్నారు. ప్రతీ జిల్లాలో జగన్ స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో పర్యటిస్తారని అధికార వర్గాల సమాచారం.


ఈ సందర్భంగా పధకాల అమలు విషయంలో పొరపాట్లు ఏమైనా ఉంటే స్వయంగా జగన్ అడిగి తెలుసుకుంటారని అంటున్నారు. అలాగే పధకాల మెరుగుదలకు  ఇంకా ఏమేమి చేయాలో కూడా వారినే సూచనలు అడుగుతారుట. తాను ప్రతీ జిల్లాకు వస్తున్నానని, ప్రతీ గ్రామానికి కూడా అవసరమైతే వస్తానని జగన్ అంటున్నారు. అందువల్ల అధికారులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు కూడా జాగ్రత్తగా ఇప్పటినుంచే తమ పనితీరును మెరుగుపరచుకోవాలని జగన్ గట్టిగానే చెబుతున్నారు.


ఇక జగన్ పర్యటనలో అర్ధం పరమార్ధం ఉన్నాయని కూడా చెబుతున్నారు. జనాల్లో తిరగడం ద్వారా సర్కార్ పనితీరు లోపాలను సవరించుకోవడంతో లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని సీట్లను గెలుచుకునేందుకు కూడా జిల్లా పర్యటనలు ఉపయోగపడతాయని జగన్ భావిస్తున్నారు. మొత్తానికి  ప్రతిపక్షానికి ఎక్కడా చాన్స్ ఇవ్వకుండా జగన్ జనంలో ఉంటానని, అక్కడ నుంచే తేల్చుకుంటానని సవాల్ చేసి మరీ చెబుతున్నారు. విపక్షాలకు ఇక పెద్ద పరీక్షే మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: