భారత్ స్వాతంత్రదినోత్సవానికి మరో రెండు రోజులు ఉన్న నేపథ్యంలో దేశమంతటా హై అలెర్ట్ నడుస్తుంది.ముఖ్యంగా ప్రధాన నగరాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, సైన్యం తనిఖీలు జరుపుతున్నాయి అనుమానం వచ్చిన వారందరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్ళి విచారిస్తున్నారు.గతంలో కంటే ఇప్పుడు భారత్ స్వాతంత్రదినోత్సవానికి ఉగ్రవాదుల నుండి ముప్పు ఉంది అని నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలోనే భారీగా తనిఖీలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ భద్రతలను కట్టుదిట్టం చేయాలని హెచ్చరికలు జారీ చేసింది.

అటు బోర్డర్ ప్రాంతాలలోను పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది.370 అధికరణ రద్దు తర్వాత పాక్ మరియు భారత్ మధ్య సంబంధాలు మరింతగా బలహీనపడ్డాయి.కాశ్మీర్ విషయంలో పాక్ ప్రతిపక్ష పార్టీలు తాలిబన్లను భారత్ పై ఉసిగొలిపే విధంగా వ్యాఖ్యలు చేశారు.వాటిని ఖండించకుండా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆర్ ఎస్ ఎస్ ఒక నాజిస్ లాంటి సంస్థ అని దాని అడుగుజాడలలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ కాశ్మీర్ లను ఊచకోత కొస్తుంది అని అనుచిత వ్యాఖ్యలు చేశారు.

రెండు దేశాల సంప్రదాయాలు ప్రకారం బక్రీద్ పండుగ సందర్భంగా భారత్ సైనికులు ఇచ్చిన మిఠాయిలను పాక్ సైనికులు పుచ్చుకోలేదు.అలాగే భారత్ స్వాతంత్రదినోత్సవాన్ని  బ్లాక్ డేగా జరుపుకుంటామని ప్రకటించింది.ఇప్పటికే లడక్ ప్రాంతంలో ఫార్వర్డ్ బేస్ లకు పాక్ తన సైనికులను పంపుతుంది.అలాగే స్కద్ ఎయిర్ బేస్ కు పాక్ వద్ద ఉన్న యుద్ద విమానాలను మరియు ఇతర యుద్ద సామాగ్రిని తరిలిచింది.చైనా జే -17 విమానాలను కూడా అక్కడికి తరలించే ఏర్పాట్లు చేస్తుంది. లడక్ ప్రాంతం వారు భారత్ ప్రభుత్వం కాశ్మీర్ పై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.ఇప్పుడు అక్కడికి  దగ్గరగా పాక్ బలగాలు మోహరిస్తూ ఉండడంతో ఏం జరగబోతుందో అని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: