నోరు జారడం తర్వాత ఎమోషన్ లో అన్నాం అని క్షమాపణ చెప్పకుండా తప్పించుకొని తిరిగి రాజకీయ నాయకుల పై ఇప్పుడు న్యాయవ్యస్థ కన్నెర్ర చేస్తుంది. ప్రభుత్వ పార్టీ వారైన వారిని వదలట్లేదు. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక పై ఒక లెక్క అని హీరో సినిమాలో చెప్పినట్టు కోర్టులు కూడా తమ మారిన తీరుని తీర్పులో చెబుతుంది.మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ తను గతంలో చెప్పిన తన స్టేట్ మెంట్  కు కట్టుబడి ఉన్నాను అని చేసిన సంచలన వ్యాఖ్యలకు పోలీసులు ఎటువంటి చర్య తీసుకోలేదు పైగా అతనికి క్లీన్ చిట్ ఇచ్చారు.దానికి బీజేపీ కరీంనగర్ పట్టణ శాఖ అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడిన వీడియో ఫుటేజ్ ను కోర్టు కు సమర్పించాడు.దానితో అతని పై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ కోర్టు పోలీస్ శాఖకు ఉత్తర్వులు ఇచ్చింది. దానితో పోలీసులు ఆయన పై కేస్ ను నమోదు చేశారు.

ఇది జరిగిన కొద్దిరోజులకే కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ పై అనుచిత వ్యాఖ్యాలు చేసినందుకు గాను అరెస్ట్ వారెంట్ జారీ అయింది.2019 ఎన్నికలలో జూలై నెలలో బీజేపీ గెలిస్తే హిందూ పాకిస్థాన్ గా మారుస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలను చేశారు. ఈ వ్యాఖ్యలను తప్పుబడుతూ సుమిత్ చౌదరీ అనే న్యాయవాది కలకత్తా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు.

దానిపై విచారణ చేసిన కోర్టు ఇప్పటికీ  శశిధరూర్ పై అరెస్ట్ వారెంట్ ను జారి చేసింది. అస్తమానం నోరు పారేసుకుంటూ వారికి నచ్చినట్టు వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తున్న రాజకీయ నాయకులకు ఈ నెలలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరి నాయకులను వదలబోమంటూ తమ తీర్పులను చెప్పిన కోర్టులను చూసి భయం పట్టుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: