ట్విట్ల యుద్ధం అని గూగుల్ సెర్చ్ చెయ్యగానే మొదటి పేరు వచ్చేది తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని గారిదే. నా ట్విట్ నా ఇష్టం అన్నట్టు ట్విట్ చేసి వార్తల్లో నిలుస్తుంటారు కేశినేని నాని. ప్రజలలోకి వెళ్లి ప్రజల సమస్యలు కనుకొని వారికీ మంచి చేసి వార్తల్లో ఉండడం కంటే వివాదాలకు ధరి తీసే ట్విట్ చేసి వార్తల్లో నిలవాలనుకుంటారేమో కేశినేని నాని. 


అధిష్టానం అధికారం కోల్పోయినప్పటి నుంచి అధిష్టానంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అతను చేసే వ్యాఖ్యలు చూస్తే పార్టీకి గుడ్ బై చెప్తారు ఏమో, సుజనా చౌదరి అడుగు జాడల్లో నడిచి బీజేపీ గూటికి చేరుతారేమో అనే ఆశ్చర్యం కల్గుతుంది. ఈ నేపథ్యంలోనే గత నెల బుద్ధా వెంకన్నపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజంతా ట్విట్ల యుద్ధం చేసి ట్విట్టర్ నెటిజన్లను ఎంటర్టైన్ చేశారు. 


ఆ సమయంలో పార్టీని వీడుతాడు ఏమో అని అందరూ భావించారు. అతను కూడా రాజీనామాకు సిద్ధం అని కూడా ట్విట్ చేశాడు. కానీ మళ్ళి రెండు రోజులకు 2024 టార్గెట్ అంటూ ట్విట్ చేశారు. దీంతో ఉంటాడు అని అందరూ అనుకున్నారు కానీ మళ్ళి తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు ఇస్తున్నా అని ప్రకటిస్తే, కేశినేని నాని మాత్రం నేను వ్యతిరేకిస్తున్న అంటూ ట్విట్ చేశారు. 


ఇంకా ఆ సమయంలో అందరూ అనుకున్నారు ఇతను మన పార్టీనే కానీ మన పార్టీకి పని చెయ్యడు అని, ఈరోజు కూడా విజయవాడలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అర్బన్ కార్యాలయాన్నికేశినేని భవన్ నుంచి ఆటోనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలోకి తరలిస్తూ టీడీపీ పార్టీ ప్రకటన చేసింది. దీంతో కేశినేని నాని ట్విట్ చేస్తూ 'ఎంత తక్కువ లగేజీ ఉంటే సుఖంగా ఉంటుంది' అంటూ ట్విట్ చేశారు. దీనికి స్పందిస్తున్న నెటిజన్లు 'బోండా ఉమా, దేవినేని అవినాష్, పార్టీ మారడం లేదు అని క్లారిటీ ఇచ్చేశారు, మీరు ఎప్పుడు ఇస్తారు క్లారిటీ' అంటూ వ్యంగ్యాస్త్రాలు కురిపించారు నెటిజన్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: