టీడీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్‌ చేశారని తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక టీడీపీ కార్యకర్తలపై 469 దాడులు జరిగాయన్నారు. ఇలాంటి అరాచకాలను ఎప్పుడూ చూడలేదు సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు అన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి అరాచకాలు ఎప్పుడూ చూడలేదని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 
8 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని.. నెల్లూరులో టీడీపీ నేతల ఇళ్లను కూల్చేశారన్నారు. గ్రామాలు వదిలివెళ్లే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. జర్నలిస్టులు, సోషల్‌ మీడియాలో విమర్శించిన వారినీ వదలడం లేదన్నారు. వైసీపీ అరాచకాలపై పోలీసులు అచేతనంగా మారారని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ నేతలు గ్రామాలకు వెళ్లి..ఎక్కడికైనా వెళ్లండని ఉచిత సలహా ఇస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.



ఇదిలా ఉండగా పార్టీ రాజుకుంటున్న అంతర్గత విభేదాలను చక్కదిద్దేందుకు చంద్రబాబు దృష్టి కేంద్రీకరించారు. ఈ క్రమంలో విజయవాడ నగర పార్టీ కార్యాలయం మార్పు వ్యవహరంపై బుద్దా, పట్టాభిలను  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మందలించారు. ఎవ్వరికీ చెప్పకుండా పార్టీ కార్యాలయం మార్పుపై ప్రకటన ఎలా చేస్తారంటూ  చంద్రబాబు ప్రశ్నించినట్టు తెస్తుంది. పార్టీ కార్యాలయం మార్పును వ్యక్తిగత విషయం కాదని బాబు స్పష్టీకరించారు.విబేధాలను వీడమంటే.. మరింత రచ్చకెక్కేలా వ్యవహరం చేయడమేంటని చంద్రబాబు నిలదీసినట్టు తెలుస్తుంది.కాగా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన మంగళవారం జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో అసంతృప్తి స్వరం విన్పించడం గమనార్హం.



ఎన్నికల ఫలితాల తర్వాత రెండోసారి జరిగిన ఈ  రాష్ట్ర స్థాయి సమావేశం ఇది. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌ రావు, ఎంపీ కేశీనేని నాని గైర్హాజరయ్యారు. గత కొంత కాలంగా చంద్రబాబు తీరుపై ఈ ఇద్దరు నేతలు అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆ ఇద్దరు అగ్ర నేతలు సమావేశానికి హాజరు కాకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.  పీఏసీ చైర్మన్‌ పదవి ఇవ్వకపోవడం పట్ల గంటా కోపంగా ఉండగా.. జిల్లా రాజకీయాల్లో చంద్రబాబు వ్యహరశైలిపై ఎంపీ నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: