తెలంగాణలో ఇంకా ఖాళీ కానీ ఓ ఎమ్మెల్సీ స్థానం కోసం ఇద్దరు సీనియర్ నేతలు తీవ్రంగా పోటీపడుతున్నారు. అది కూడా వేరే పార్టీల నుంచి వచ్చిన టీఆర్ఎస్ నేతలు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఎమ్మెల్సీ భూపతిరెడ్డి టీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డితో ఉన్న విభేదాలు కారణంగా భూపతి రెడ్డి పార్టీ మారారు. అయితే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అయిన భూపతిరెడ్డిపై టీఆర్ఎస్ వేటు వేసింది. 


ఇక దీనిపై భూపతి సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. ప్రస్తుతానికి భూపతి పిటిషన్ సుప్రీంలో విచారణ దశలో ఉంది. దీనిపై తుదితీర్పు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. అయితే ఈ తీర్పు ఇంకా తేలకముందే టీఆర్ఎస్ లో ఇద్దరు సీనియర్ నాయకులు ఆ పదవి కోసం పోటీపడుతున్నారు. అందులో ఒకరు కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి కాగా, మరొకరు టీడీపీ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి.


సురేశ్ రెడ్డి...కేసీఆర్ కేబినెట్ లో స్థానం కల్పిస్తారని ఆశతో ఉన్నారు. అందుకు తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని అనుకుంటున్నారు. ఇప్పటికే తన మనసులో మాట టీఆర్ఎస్ అధిష్టానంతో మాట్లాడారని తెలుస్తోంది. ఇక టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యేప్పుడు తనకు ఎమ్మెల్సీ పదవి హామీ ఇచ్చారని అరికల నర్సారెడ్డి చెబుతున్నారు. తనకు ఎలాగో ఎమ్మెల్సీగా అనుభవం ఉంది కాబట్టే పదవి తనకే ఇస్తారని నర్సారెడ్డి ధీమాగా ఉన్నారు. 


మొత్తానికి ఖాళీ కానీ స్థానం కోసం ఇద్దరు నేతలు గట్టిగానే పోటీ పడుతున్నారు. మరి చూడాలి వీరిలో టీఆర్ఎస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో. ఇటీవ‌ల ఖాళీ అయిన ఒక్క ఎమ్మెల్సీని కేసీఆర్ రెడ్డి వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నేత గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డికి కేటాయించిన సంగ‌తి తెలిసిందే,


మరింత సమాచారం తెలుసుకోండి: