ఏపీలో తాజా రాజ‌కీయ ప‌రిణామాలు శ‌ర‌వేగంగా మారే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఫార్టీ ఫిరాయింపులు జోరుగా జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే పార్టీ ఫిరాయింపులపై మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చేరేందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తమను సంప్రదిస్తున్నట్లు స్పష్టం చేశారు. టీడీపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని అవంతి బాంబు పేల్చారు.


ఇక జ‌గ‌న్ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు చేరతామంటూ పదేపదే తమకు చెప్తున్నారని తెలిపారు. అయితే సీఎం జగన్ ఫిరాయింపులకు డోర్లు లాక్ చేయడంతో వారి రాకకు అడ్డంకిగా మారిందని ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక తొలి అసెంబ్లీ స‌మావేశాల సెష‌న్స్ అప్పుడే నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథ‌ర్‌రెడ్డి మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని... వీరిలో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు స్వ‌యంగా త‌న‌తో పార్టీ మారే అంశంపై మాట్లాడార‌ని చెప్పారు.


ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేల్లో ఒక‌రు నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన వ్య‌క్తిగ‌త ఇమేజ్ ఉన్న వ్య‌క్తే అని కూడా చెప్పారు. ఆ వ్యాఖ్య‌లు అప్ప‌ట్లో క‌ల‌క‌లం రేపాయి. ఇక ఇప్పుడు మ‌రోసారి మంత్రి అవంతి చేసిన వ్యాఖ్య‌లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. జ‌గ‌న్ డోర్లు లాక్ చేయ‌బ‌ట్టి టీడీపీ ఏపీలో బ‌తుకుతోంది గాని.. లేక‌ప‌తే ఈ పాటికే క్లోజ్ అయిపోయేద‌ని ఆయ‌న చెప్పారు.


తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ తుడుచుకుపుపెట్టుకుపోవ‌డం ఖాయ‌మ‌ని... ఆ పార్టీ ఇక ఇక్క‌డ బ‌తికే ఛాన్స్ లేద‌ని కూడా అవంతి తెలిపారు. టీడీపీలో హ‌యాంలో జ‌రిగిన త‌ప్పుల‌తో పాటు అవినీతి మొత్తం బ‌ట్ట‌బ‌య‌లు చేస్తామ‌ని చెప్పారు. విశాఖపట్నంలో భూ కుంభకోణంపై సిట్ నివేదికను బయటపెట్టాలని మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏదేమైనా అవంతి వ్యాఖ్య‌లు ఇప్పుడు టీడీపీని కుదిపేస్తున్నాయి. ప‌క్క చూపులు చూస్తోన్న ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవ‌ర‌న్న‌దానిపై కూడా ఎవ‌రికి వారు గుస‌గుస‌లాడుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: