డ్రంక్ అండ్ డ్రైవ్ ల తీరు పట్ల న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసిన వైనమిది. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో చోటుచేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులు బైక్ ను పట్టుకున్నారు. కానీ న్నాయస్థానం ఛార్జ్ షీట్ లో మాత్రం ఆటో అంటూ ఎంట్రీ చేశారు. దీంతో జడ్జి మొదటి సారి రిజెక్ట్ చేసిన వైనమిది. రెండవసారి బైక్ ప్రక్కకు నిలబెట్టి ఫొటో  దింపి ఛార్జ్ షీట్ కు అటాచ్ చేసి పెట్టినా ఫలితం లేకుండా పోయింది. మొదటి సారితో పాటు రెండవ సారి కూడా రిజెక్ట్ చేశారు. ఛార్జ్ షీట్ మొత్తమే కొత్తది రాయమని జడ్జి ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. దీంతో గత పది రోజుల నుండి తిరిగి తిరిగి విసిగి వేసరినా గిరిజన యువకుడు ఉదంతమిది. షాద్ నగర్ ట్రాఫిక్ పోలీసుల తీరుపై మండి పడుతున్న ప్రజలు.



రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ట్రాఫిక్ పోలీసులు తప్పటాడుగు వేశారు ఈ నెల 4వ తేదీనా ఫరూక్ నగర్ మండలంలోని కిషన్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రబిడ్స్ తండాకు చెందిన పాత్లవత్ లింగం అనే యువకుడు తన ద్విచక్ర వాహనంపై  బైక్ నెంబర్ TS 07,జిబి,9912,ద్విచక్ర వాహనంపై షాద్ నగర్  వచ్చినా సందర్భంలో షాద్ నగర్ ట్రాఫిక్ సిఐ సునీల్ తో పాటు సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు తనిఖీలలో ఆల్కహాల్ పర్సెంట్ 50 శాతం రావడంతో కేసు నమోదు చేశారు పోలీసులు కానీ కోర్టుకు సమర్పించే ఛార్జ్ షీట్ లో మాత్రం ఆటో అని రాశారు దింతో తన భార్య పిల్లలతో కౌన్సిలింగ్ కు హాజరైన లింగం కోర్టుకు హాజరయ్యారు.



అయితే జడ్జీ  బాబు నిది ఆటో నా అని అడిగితే  బాధితుడు మాత్రం కాదు సారు  బైక్ అని చెప్పడంతో  జడ్జ్ వెంటనే రిజెక్ట్ చేశారు రెండవ సారి ట్రాఫిక్ పోలీసులు మాత్రం మరో తప్పు చేశారు బైక్ ప్రక్కకు లింగం ఫొటో తీసి కోర్టుకు సమర్పించారు జడ్జ్ మళ్ళీ రిజెక్ట్ చేసి మొత్తం కొత్త ఛార్జ్ షీట్ రాయాలని ఆదేశించారు  దీనితో బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తను శంషాబాద్ లో ఓ హోటల్లో పని చేసుకొని జీవనం సాగిస్తున్ననాని ట్రాఫిక్ పోలీసుల తీరు వల్ల పనికి వెళ్లడం లేదని వాపోతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: