ముఖ్యమంత్రిగా  'వై ఎస్ జగన్' తీసుకుంటున్న  సంచలనాత్మక  నిర్ణయాలు ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారుతున్నాయి. మొదట్లో జగన్ దూకుడు చూసి కొత్తలో అలాగే ఉంటుందిలే అనుకున్నారు అంతా. కానీ జగన్ ప్లాన్ లు.. ఆర్ధికపరమైన లావాదేవీల గురించి జగన్ కున్న అవగాహన చూస్తుంటే.. బాబుక్కూడా మైండ్ పని చేయట్లేదట. ముఖ్యంగా జగన్  ఎన్నికల హామీ సమయంలో నవ రత్నాలు ప్రకటించాడు. వాటిని నెరవేర్చిన తర్వాతే మళ్ళీ 2024లో ఓట్లు అడుగుతానంటూ మాట ఇచ్చాడు.  అయితే ఇక సీఎం అయినా మొదటి రోజు నుండి నవ రత్నాల మీద ఫోకస్ పెట్టాడు జగన్. అందులో భాగంగా మొదట గ్రామ వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేస్తున్నాడు. అది ఏర్పడిన తర్వాత తమ పధకాలు నేరుగా ప్రజలకి వెళ్లేలా చేయటానికి సరికొత్త ప్లాన్ సిద్ధం చేశాడు.  ఈ నెల 15వ తేదీ  నుండి గ్రామ వాలంటీర్ వ్యవస్థని జగన్ ప్రారభించబోతున్నాడట. ప్రతి నెల 1వ తేదీ  నుండి 10తేదీ లోపు పెన్షన్ ప్రతి ఇంటికి గ్రామ వాలంటీర్ అందిస్తారట. ఆ తర్వాత 10వ తేదీ నుండి 15వ తేదీదాక రేషన్, కొత్త పెన్షన్ విషయాలు చూసుకుంటారట. ఆ తరువాత 15వ తేదీ  నుండి 30వ తేదీదాక ప్రభుత్వ పథకాలు సరిగ్గా అమలు అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటారట. 


అలాగే ప్రతి ఇంటికి తిరిగి ఇళ్ల పట్టాలు ఉన్నాయా లేదా అనేది కూడా పరిశీలించి వాటికీ తగ్గట్లు పనులు చేపడతారట.  మొత్తానికి  తాను ఇచ్చిన నవ రత్నాలు హామీలను నెరవేర్చేదాకా వెనకడుగు వేసేది లేదన్నట్లు జగన్ దూసుకొనిపోతున్నాడుగా. ఇప్పటికే  నవరత్నాల హామీను ఆచరణలో పెట్టబోతున్న  జగన్.. ఇంకా అదనపు హామీల కోసం కూడా  అహర్నిశలు శ్రమిస్తున్నాడు.   సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా  జగన్  అధికార పార్టీ టీడీపీని మరియు బాబును ముప్పుతిప్పలు పెడుతున్నాడు.  ఏమైనా జగన్  దూకుడు ముందు  నలభై ఏళ్ల అనుభవం ఉన్న బాబు కూడా ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తోంది. ఏది ఏమైనా  జగన్ మాత్రం తను  ఇచ్చిన నవ రత్నాలను పక్కాగా అమలు చేస్తే మాత్రం  ఇక జగన్ కి తిరుగుండదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: