రాష్ట్రం లో నడుస్తున్నది కల్వకుంట్ల ప్రభుత్వమేనని బీజేపీ  అధ్యక్షుడు లక్ష్మణ్ అంటున్నారని  ..అవును కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వం లోనే ప్రభుత్వం నడుస్తోందని  ..అందు లో తప్పేముంది ? రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు . కేంద్రం లో నడుస్తోంది మోడీ ప్రభుత్వం కాదా ? అంటూ నిలదీశారు . పొద్దున లేచింది మొదలు కెసిఆర్ కుటుంబం మీద పడి ఏడవడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని ఆయన విరుచుకుపడ్డారు . కెసిఆర్ కుటుంబ సభ్యులెవ్వరూ నామినేటెడ్ కోటా లో పదవులు తెచ్చుకోలేదని , ప్రజలు ఆశిర్వాదిస్తేనే గెలిచారన్నారు .


 కుటుంబపార్టీ ల గురించి మాట్లాడాల్సి వస్తే అందరి గురించి మాట్లాడాల్సి వస్తుందన్నారు .   ఎంఐఎం తెరాస  దోస్తీ ని బూచిగా చూపించి బీజేపీ ప్రజలను రెచ్చగొడుతోందని మండిపడ్డారు . ఎం ఐఎం పుల్వామా దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపలేదా ? అన్న తలసాని , కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ కు నిధులు తెప్పించి ప్రజల్లో పరపతి పెంచుకుంటే బీజేపీ ని ఎవరు కాదన్నారని ప్రశ్నించారు . నిన్న మొన్న బీజేపీ లో చేరిన ఓ పెద్ద మనిషి కూడా తెరాస  మీద ఏదేదో మాట్లాడుతున్నారని పరోక్షంగా మాజీ ఎంపీ వివేక్ పై విమర్శలు గుప్పించారు . తెరాస  లో ఆయన ఉన్నపుడు పార్టీ  ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చిందని , అయన  తండ్రి  గౌరావార్దం హైదరాబాద్ లో విగ్రహం ఏర్పాటు చేశామన్నారు .


 ప్రజాస్వామ్య బద్దంగా బీజేపీ బలపడతానంటే ఎవరూ కాదనరని కానీ నాలుగు ఎంపీ సీట్లు గెలిచినంత మాత్రాన బీజేపీ నేతలు ఎగిరెగిరి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు . తెలంగాణ లో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచింది తెరాస  యా ?బీజేపీ యా ? అన్న తలసాని ,  అన్ని వర్గాల పండగలను అధికారికంగా నిర్వహించింది తెరాస  ప్రభుత్వమే తప్ప బీజేపీ కాదని గుర్తు చేశారు . బీజేపీ ఇంత వరకు ఒక్క గుడినైనా కట్టిందా ? ,  తమ ప్రభుత్వం హాయం లో యాదాద్రి కడుతున్నామని చెప్పారు . యాగాలు ,హోమాలు చేయడం కూడా బీజేపీ కి చేతకాదని  .. తాము  చేస్తున్నామన్నారు . మజ్లీస్ తో బీజేపీ ని పోరాడామనండి ..ఎవరు వద్దన్నారని అన్న తలసాని , మధ్యలో తెరాస  ను బీజేపీ ఎందుకు లాగుతోందని  ప్రశ్నించారు .


మరింత సమాచారం తెలుసుకోండి: