వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం కాగానే.. అమరావతి నిర్మాణంపై సందేహాలు మొదలయ్యాయి. ఊహించినట్టుగానే అమరావతిలో నిర్మాణాలు ఆగిపోయాయి. గత చంద్రబాబు ప్రభుత్వం రాజధాని పేరుతో చేసిన స్కాములన్నీ బయటకు తీసి.. నిగ్గు తేల్చిన తర్వాతే.. మళ్లీ అమరావతిలో నిర్మాణాలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


అయితే ఈ పరిస్థితిని అడ్డుపెట్టుకుని టీడీపీ వైసీపీ సర్కారుపై దుష్ప్రచారం చేసేందుకు రెడీ అవుతోంది. అమరావతిలో రియల్ ఎస్టేట్ పడిపోయిందంటూ గగ్గోలు పెడుతోంది. అంతే కాదు.. ఇటీవల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ధరలు పెరిగాయి. అమరావతిలో నిర్మాణాలు ఆగిపోయినందుకే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పెరిగిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా కామెంట్ చేశారు.


తెలుగుదేశం అధినేత చంద్రబాబు అధ్యక్షతన విజయవాడలో పార్టీ రాష్ట్ర విస్త్రృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే చంద్రబాబు ఈ కామెంట్లు చేశారు. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబు... ఓటమికి అధైర్యపడి కూర్చోవద్దని, సంక్షోభాలను దాటుకుంటూ ఇక ముందుకు పోవాలని అన్నారు.మంచిగా పని చేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం అనుకున్నామన్న చంద్రబాబు..కానీ ప్రభుత్వం విధ్వంసకరంగా పని చేస్తున్నందున పోరాట బాట పట్టక తప్పదని అంటున్నారు. జగన్ పులివెందుల పంచాయతీలు రాష్ట్రంలో చేయనివ్వమని స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ ముందుకు పోవడం తప్ప ఈ ప్రభుత్వం మరేం చేయటం లేదని చంద్రబాబు విమర్శించారు.


అమరావతికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా చేపట్టామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇప్పుడు అమరావతి నిర్మాణం నిలిపివేస్తే.. హైదరాబాద్ భూములకు బూమ్ వచ్చిందని చంద్రబాబు తన వంతు భాష్యం చెప్పారు. హైదరాబాద్‌లో రోజూ విమానాలు పెరుగుతుంటే, అమరావతిలో 2 నెలల్లో 20విమానాలు రద్దయ్యాయని చంద్రబాబు చెప్పారు.విజయవాడ నుంచి విశాఖ వెళ్లాలంటే వేరొక రాష్ట్రం మీదుగా వెళ్లే పరిస్థితి తెచ్చారని దుయ్యబట్టారు. నగరాల మధ్య విమానాల కనెక్టివిటీ లేకుండా చేశారని జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: