ఏపీలో బలమైన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం. ఆయన మంత్రిగా పనిచేశారన్న సంగతి ఇప్పటి జనరేషన్ కి తెలియదు. ఎందుకంటే ఆయన కాపులను బీసీల్లో చేర్పించాలని డిమాండ్ చేస్తూ దానికే  అంకితం అయి ముప్పయ్యేళ్ళుగా అదే పోరాటం మీద ఉన్నారు. ఇక ముద్రగడను కులనాయకునిగా చూసేఈనాటి  తరంలో  తాను సైతం అదే స్టాండ్ తో ముందుకు సాగుతున్నారు.


తాను బతికి ఉండగానే కాపులకు బీసీ హోదా  రావాలని ముద్రగడ కోరుకుంటున్నారు. ఇక 2014 ఎన్నికల్లో చంద్రబాబు కాపులకు  బీసీల్లో కాపులను కలుపుతామని హామీ ఇచ్చారు. కాపుల మద్దతుతో అధికారంలోకి బాబు వచ్చారు. అయితే ఆయన అనుకున్నట్లుగా చేయలేక‌పోయారు. దాంతో ముద్రగడ అయిదేళ్ళుగా పోరాటం చేస్తూ వచ్చారు. బాబు గద్దె దిగాలని ఆయన బ‌లంగా కోరుకున్నారు.


ఆ విధంగా బాబు గద్దె దిగిపోయారు. జగన్ అధికారంలోకి వచ్చారు. ఆయన కాపుల విషయంలో ఏ హామీ ఇవ్వలేదు కాబట్టి నైతికంగా డిమాండ్ చేసే హక్కు ముద్రగడకు లేదు. అక్కడికీ టీడీపీ ప్రభుత్వం చివర్లో తీసుకువచ్చిన బిల్లు ప్రకారం ఆర్ధికంగా వెనకబడిన జాబితాలో కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతూ జగన్ కి లేఖ రాశారు. 


అయితే జగన్ అది కేంద్ర కోటా అని మార్చేందుకు ఎటువంటి హక్కులు శాసనసభకు లేవని తేల్చి  చెప్పారు. దాంతో ఇపుడు ముద్రగడ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ కి లేఖ సంధించారు. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్లు  ఇప్పించాలని ఆయన అందులో  కోరడం విశేషం. మరి ముద్రగడ డిమాండ్ ని మోడీ పట్టించుకుంటారా. ఏపీలో  కాపులను అక్కున చేర్చుకోవాలనుకుంటే ఇదే మంచి అవకాశం. అలా చేస్తారా. చూడాలి మరి. ఏది ఏమైన ముద్రగడ పోరాటం ఇపుడు ఏపీని దాటి ఢిల్లీకి చేరినట్లుగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: