ఇప్పుడు ఓ భయం ప్రపంచ దేశాలను వణికిస్తోంది.. మరో 9 నెలల్లో రాబోయే ఆ ఉపద్రవాన్ని తలచకుని భయంతో అల్లాడుతున్నాయి. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలా అని బుర్రబద్దలు కొట్టుకుంటున్నాయి. గతంలో ఎదురైన పరిస్థితులను తలచుకుని నష్టనివారణ మార్గాలు వెదుకుతున్నాయి. మరి ఇంతకీ అంతగా భయపెడుతున్న ఆ సమస్య ఏంటి..?


అదే ఆర్థిక మాంద్టం.. ఇంగ్లీషులలో రెసిషన్ అంటారు. 2008-09 సంవత్సరాల్లో అమెరికా వంటి అగ్రరాజ్యాలనే గడగడా వణికించింది. వరుసగా మూడేళ్ల పాటు ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెట్టింది. మళ్లీ ఇప్పుడు ఆ మాంద్యం భూతం వచ్చే సంకేతాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. రాబోయే 9 నెలల్లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కాటేసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు.


అసలు ఈ ఆర్థిక మాంద్యం ఎందుకు వస్తుంది.. వరుసగా రెండు త్రైమాసికాల పాటు ఉత్పత్తి పడిపోతే మాంద్యం మొదలైనట్టే. దీనికితోడు ఉద్యోగాలు తగ్గిపోయి చమురు డిమాండ్ తగ్గిందంటే.. మాంద్యం వస్తున్న సంకేతాలు కనిపించినట్టే.. మాంద్యం వస్తే ఏమవుతుంది.. అంతర్జాతీయ వృద్ధిరేటు పడిపోతుంది. ఉద్యోగాల్లో కోత స్టార్ట్ అవుతుంది. ఉన్న ఉద్యోగస్తులకు జీతాలు తగ్గిపోతాయి.


ఒక్కోసారి మాంద్యానికి ఒక్కో విషయం కారణమవుతుంది. 2008లో ఆర్థిక మాంద్యానికి అమెరికా సబ్ ప్రైమ్ ప్రధాన కారణం.. ఈసారి అమెరికా - చైనా మధ్య మొదలైన వాణిజ్య యుద్ధం కారణం కావచ్చని భావిస్తున్నారు. ఈ రెండు దేశాలూ ప్రస్తుతం ఇతర దేశాల వస్తువులపై టాక్సులు పెంచుతున్నాయి. ఇదే కొనసాగితే... మరికొన్ని నెలల్లో ఆర్థిక మాంద్యం రావడం ఖాయంగా కనిపిస్తోంది.


ఆర్థిక మాంద్యం సంకేతాలు కనిపించడంతో ముందుగా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే సింగపూర్ మేలుకొంది. సింగపూర్ ఆర్థిక వృద్ది తగ్గిపోయింది. చైనా ఆర్థికవ్యవస్థ కూడా సింగపూర్‌ తరహాలోనే వృద్ధిరేటు తగ్గింది. మాంద్యం వచ్చేందుకు 20 శాతం వరకు ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆర్థికమాంద్యం ప్రభావం భారతదేశం మీద అంతంత మాత్రంగానే ఉంటుందని మోర్గాన్‌ స్టాన్లీ సంస్థ చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: