ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి ప్రమాదం వచ్చింది.  ప్రస్తుతం ఆయన అమరావతిలో నివాసముంటున్న విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు నివాసం ప్రమాదంలో పడింది. పులిచింతల ప్రాజెక్టు నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కృష్ణా కరకట్ట ప్రమాదంలో పడింది.  దీనిని ఆనుకుని నిర్మించిన అనేక నిర్మాణాల్లోకి ఇప్పటికే భారీగా వరద నీరు చేరింది. ఇటీవల ఉండవల్లిలోని నివాసానికి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కరకట్ట పక్కన ఎండుగడ్డి తగులబడటంతో ఈ ప్రమాదం జరిగింది.


మంటలు పక్కకు వ్యాపించడంతో అరటి తోట దగ్ధమైంది. మొత్తానికి ఫైర్ సిబ్బంది అలర్ట్ కావడంతో పెను ప్రమాదం తప్పింది.  ఇప్పుడు ఏపిలో భారీ వర్షాల కారణంగా ఎక్కడ చూసిన వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని గెస్ట్‌హౌస్ మెట్ల వరకు నీరు చేరుకోవడంతో ఆందోళన మొదలైంది. పులిచింతల నుంచి ఆరు లక్షల క్యూసెక్కుల నీటిని వదిలితే కరకట్ట పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉంది.  కాగా, ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పిన విషయాలు ఇప్పుడు తేటతెల్లమవుతున్నాయి. 


పర్యావరణానికి విరుద్దంగా ఇళ్ల నిర్మాణాలు, ఇతర ఏ నిర్మాణాలైన ఏదో ఒక సమయానికి దెబ్బతినే ప్రమాదం ఉందని అన్నారు.  అందుకే ఆయన అమరావతిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై దృష్టి సారించారు.  ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో పడుతున్న వర్షాల కారణంగా నదుల్లోకి బారీగా నిలి నిల్వలు పెరిగిపోతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కృష్ణా నది పొంగి ప్రవహిస్తోంది. నదీ ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు.


ఈ నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయిలో నిండడంతో 5 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఫలితంగా కృష్ణా కరకట్ట ప్రమాదంలో పడింది. చంద్రబాబు నాయుడు ఇంటి కి ప్రమాదం అన్న విషయం  ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: